హైదరాబాద్ – ఈ – కార్ రేసులో కేసు పెట్టాల్సింది సీఎం రేవంత్ రెడ్డి పైనే అని అన్నారు. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంత్ రెడ్డే కారణమని పేర్కొన్నారు.కేటీఆర్ పై నాన్ బేలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులపై గురువారం రాత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో రేసింగ్ రావాలని చాలా ప్రయత్నాలు గతంలోనే జరిగాయని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా రేసింగ్ కోసం ఎంతో ప్రయత్నం చేశాడని.. 2003 ప్రాంతంలో ఫార్ములా ఈ రేసింగ్ సీఈవో ను కలిసి హైదరాబాద్ కి రావాలని చంద్రబాబు అడిగారని తెలిపారు కేటీఆర్.
కానీ చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోవడంతో హైదరాబాద్ కి రేసింగ్ రాలేదని తెలిపారు. అప్పట్లోనే గోపాన్ పల్లిలో రేసింగ్ కోసం 500 ఎకరాలు సేకరించారని పేర్కొన్నారు.ప్రభుత్వం సేకరించిన 500 ఎకరాలలో రేవంత్ రెడ్డికి కూడా 15 ఎకరాలు ఉందని తెలిపాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పట్లో హైదరాబాద్ కి రేసింగ్ రాలేదని అన్నారు.
హైదరాబాద్ ని ప్రపంచ పటంలో ఉంచడమే తాను చేసిన తప్పా..? అని నిలదీశారు.“ఈ రేస్ కి 150 కోట్లు ఖర్చు చేస్తే.. 700 కోట్ల లాభం వచ్చింది. ఈవెంట్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాలి అనుకున్నాం. ఎలాన్ మస్క్ తీసుకువద్దాం అనుకున్నాం. ఈ ఈవెంట్ ని హెచ్ఎండిఏ దగ్గర ఉండి చూసుకోండి. రేస్ కు ఖర్చు మొత్తం హెచ్ఎండిఏ పెట్టింది. హైదరాబాద్ లో జరిగే ఏ కార్యక్రమమైనా హెచ్ఎండిఏ దగ్గరుండి చూసుకుంటుంది. ఇందులో తప్పు జరిగిందని నిరూపించగలరా..?” అని ప్రశ్నించారు కేటీఆర్.
ఫార్ములా ఈ రేసింగ్ ప్రమోటర్లు గతేడాది డిసెంబర్ 13న సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు అని కేటీఆర్ గుర్తు చేశారు. వచ్చే మూడేండ్లు రేసింగ్ నిర్వహిస్తామంటూ దాన కిశోర్‌కు ఆల్బర్టో లేఖ రాశారు. మరోసారి నిర్వహణపై డిసెంబర్ 21 లోపు స్పష్టత ఇవ్వాలని మెయిల్ పెట్టారు కానీ రేవంత్ మూడో సారి డబ్బులు చెల్లించకపోవడంతో క్యాన్సిల్ అయిందని చెప్పారు. కుదిరితే నాలుగు రోజులు టైమ్ ఇవ్వగలమని ఫార్ముల డైరెక్టర్ రేవంత్ గవర్నమెంట్ కు పంపించారు. . రేసింగ్ రద్దు అయిపోగానే ఎఫ్ఎంఎస్ వాళ్లు రూ. 74 లక్షలు చెల్లించారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాచి పెడుతుందని కేటీఆర్ తెలిపారు
.అన్నింటికి మించి ఫార్ములా ఈ వాళ్లు ఆర్బిట్రేషన్ ద్వారా కొట్లాడుతున్నారు. వాళ్ల మీద కేసు వేస్తే ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్జత్ పోదా..? అని కేటీఆర్ నిలదీశారు.
ఇందులో రేవంత్ రెడ్డి శాడిస్ట్ మెంటాలిటీ తప్ప మరేమీ లేదని అన్నారు.కుంభకోణం, లంబకోణం అంటూ డ్రామాలు చేస్తున్నారని.. కానీ దీనిపై అసెంబ్లీలో చర్చకు రమ్మంటే మాత్రం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తనపై నమోదు చేసిన కేసులో అసలు అవినీతి లేదని అన్నాడు కేటీఆర్. “ఏం చేసుకుంటావో చేసుకో రేవంత్ రెడ్డి.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు. నేను ఏ తప్పు చేయలేదు. అందుకే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.