Friday, November 22, 2024

Count Down .. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కు కౌంట్ డౌన్ ….అప్పుడే ప్ర‌చారానికి తెర‌లేపిన పార్టీలు …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో:

నిర్వ హణ ప్రక్రియకు ఏర్పాట్లన్నీ సవ్యంగా ఉన్నా యని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిష నర్‌ ఇటీవల తేల్చి చెప్పడంతో అతిత్వరలోనే ఐ దు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మో గ నుంది. ఈ నెల 8 నుంచి 10 మధ్య కేంద్ర ఎన్ని కల సంఘం షెడ్యూ ల్‌ ప్రకటించే అవకాశం ఉం ది. నవంబర్‌, డిసెంబర్‌లో పోలింగ్‌ జరగ వచ్చ ని అనధికారికంగా కథనాలు వెలువ డు తు న్నా యి. డిసెంబర్‌ రెండో వారంలో ఓట్ల లెక్కి ంపు జరగవచ్చని తెలుస్తోంది. అదే వాస ్తవ మన్న కొ ణంలో సంబంధిత అధికారులు కూ డా పరోక్షంగా ధ్రువీకరిస్తున్నారు. విశ్వసనీయ సమా చారం మేరకు తెలంగాణ, రాజస్తాన్‌, మి జొ రం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మా త్రం రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించను న్నట్లు- తెలుస్తోంది.

షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది చివరి నా టికి ప్రభుత్వాల ఐదేళ్ల గడువు ముగియ ను న్న ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను వచ్చే రెండు, మూడు రోజుల్లోనే ఎన్నికల సం ఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లు- జాతీయ మీడి యాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది ము గిసే నాటికి తెలం గాణతో పాటు రాజస్తాన్‌, మి జోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో పోలిం గ్‌ నవంబర్‌ మధ్య నుంచి డిసెంబర్‌ తొలి వార ంలోపు జరపవచ్చని ఈసీ వర్గాలను ఉటం కిస్తూ ఈ కథనాలు పేర్కొన్నాయి. ఇప్పుడు జరుగుతున్న తరహాలోనే 2018 శాసనసభ ఎన్నికల ముందు కూడా కసరత్తు నిర్వ హించి ఎన్నికల ప్రక్రియను పూర్తిచేశారు. అయితే, ఈ సారి పోలింగ్‌ తేదీలు మాత్రం 5 రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటాయని అనధికారిక సమా చా రాన్ని బట్టి తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 10 నుంచి 15వ తేదీ మధ్య ఉండొచ్చని సీఈవో కార్యాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మి జోరం శాసనసభ గడువు డిసెంబర్‌ 17తో ముగి యనుంది. తెలంగాణ, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల గడువులు 2024 జన వరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి. అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వ హించేందుకు వ్యూహాన్ని ఖరారు చేయ డానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకులతో సంప్రదింపులు జరుపుతోంది. ఎన్నికల ప్రవర ్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయ డ ం సహా క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధన ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూ హాన్ని ఈసీ అమలు చేయనుంది. ఇందు కోసం పోలీసులు, ఇతర విభాగాలకు సంబం ధించిన పరిశీలకులతో శుక్రవారం ఢిల్లిలో సమీ క్ష జరిపి తుది ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు సమా చారం అందుతోంది.

ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృం దం అయిదు రాష్ట్రాల్లో పర్య టిం చింది. అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థి తులపై సమీక్షలు జరిపింది. ఛత్తీస్‌గఢ్‌, రాజ స్తాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. అలాగే తెలం గా ణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య త్రి ము ఖ పోరు జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్ని కలకు ముందు జరుగుతున్న శాససనభ ఎన్ని కలు కావడం వల్ల అన్ని పార్టీలు ప్రతి ష్టా త్మ కంగా తీసుకున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ అధికారం ఉంది. ఈ సారి ఎలాగైనా ఆ రెండు రాష్ట్రాల్లో విజయ కేత నం ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అలా గే మధ్య ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌ను ఓడించి అధికారంలోకి రావా లని కాంగ్రెస్‌ ఉవిళ్లూ రుతోంది. ఇప్పటికే ఎన్ని కలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ప్రచా రాన్ని మొదటు పెట్టాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement