Thursday, November 14, 2024

TG | పత్తి కొనుగోలు చేయాలి.. రైతుల ఆందోళ‌న‌

  • కోదాడ జడ్చర్ల రహదారిపై ధ‌ర్నా
  • మూడు రోజులుగా ఆపేశార‌ని ఆగ్రహం
  • ఆంధ్రప్రభ స్మార్ట్, నల్లగొండ : సీసీఐ ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా పత్తి కొనుగోళ్లు నిలిపోయాయ‌ని రైతులు నల్లగొండ ఆగ్ర‌హించారు. జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లి మండలం నీలంనగర్ వద్ద సోమవారం కోదాడ జడ్చర్ల రహదారిపై ఆందోళనకు దిగారు. నీలంనగర్ వద్ద ఉన్న ఎస్వీఎస్ కాటన్ మిల్లుకు పరిసర ప్రాంత రైతులు పెద్ద ఎత్తున పత్తి విక్రయించేందుకు ట్రాక్టర్లు, ఆటోలలో తీసుకొచ్చారు. కొంతమంది శుక్రవారం మిల్లు వద్దకు పత్తిని తీసుకువచ్చారు. శుక్రవారం పొద్దు పోవడంతో మిల్లు యాజమాన్యం పత్తి తూకం వేయకుండా నిలిపివేసింది.

శనివారం, ఆదివారం సీసీఐ సెలవు దినం కావడంతో పత్తిని తూకం వేయలేదు. సోమవారం రైతులు పెద్ద ఎత్తున పత్తి తీసుకురావడంతో ప్రధాన రహదారి వాహనాలతో నిలిచిపోయింది. అయితే.. కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్లకు నూతన నిబంధనలు విధించడంతో రాష్ట్రీయ కాటన్ అసోసియేషన్ నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పత్తి కొనుగోళ్లను ఆపేసింది. దీంతో ఆగ్రహించిన రైతులు మిల్లు ఎదుట రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. త‌హ‌సీల్దార్ వచ్చి సమాధానం చెప్పేంతవరకు ఆందోళన విరమించమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement