Friday, November 22, 2024

వినూత్నం – చేతి సంచుల కోసం ఎటిఎం..

హైద‌రాబాద్ – ఏటీఎంలో ఇప్పటి వరకు డబ్బులు రావడం చూశాం. ఎనీటైం వాటర్‌ పేరుతో నీళ్లు రావడం కూడా చూశాం.. తాజాగా 10 రూపాయలు వేస్తే క్లాత్‌ బ్యాగ్‌ వస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆచరణలో చేసి చూపించింది జీహెచ్‌ఎంసీ ప్లాస్టిక్హ్రిత నగరంగా తీర్చిదిద్దడం కోసం రెండు ప్రైవేటు సంస్థలతో కలిసి నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఐడీపీఎల్‌ పండ్ల మార్కెట్‌ వద్ద క్లాత్‌ బ్యాగ్‌ ఏటీఎంను ఏర్పాటుచేసింది. బాలానగర్‌ డివిజన్‌లోని ఐడీపీఎల్‌ ఫ్రూట్‌ మార్కెట్‌ వద్ద మోవెట్‌, యునైటెడ్‌ వే హైదరాబాద్‌ సౌజన్యంతో ఎనీ టైం కాటన్‌ బ్యాగ్‌ (బ్యాగ్‌ ఏటీఎం)ను అధికారులు ప్రారంభించారు. మోవెట్‌ స్వచ్ఛంద సంస్థ రూ.2.5 లక్షలతో చెన్నై నుంచి ఈ మిషన్లను తెప్పించి ఇక్క‌డ ఏర్పాటు చేసింది.. సెల్ప్‌ హెల్ప్‌ గ్రూపుల వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కాటన్ క్లాత్ తో బ్యాగులు తయారు చేసే బాధ్యతను వారికి మోవెట్ స్వ‌చ్చంద సంస్థ చేప‌ట్టింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement