Friday, November 22, 2024

TS : రాజన్న ఆలయంలో అవినీతి…12 మందిపై చర్యలకు ఆదేశాలు

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పదిమంది అధికారులు లపై చర్యలు తీసుకోవాలంటూ ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ వేములవాడ ఇన్చార్జి ఈఓ కృష్ణ ప్రసాద్ కు ఆదేశాలు జారీ చేశారు. 2021 సంవత్సరంలో రాజన్న ప్రసాదం తయారీ లో అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దాడులు జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తూ, తప్పుడు సమాచారం ఇచ్చారని వారిపై సత్వరమే విచారణ ప్రారంభించాలనీ ఆర్జెసి రామకృష్ణరావును విచారణ అధికారిగా దేవాదాయ శాఖ నియమించింది.

- Advertisement -

ఆర్ జె సి రామకృష్ణారావు విచారణ చేపట్టి సంబంధిత పదిమంది అధికారులకు విజిలెన్స్ దాడుల నివేదిక పై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. సంజాయిషీ నోటీసులో సంతృప్తికరమైన సమాచారం లేదనీ తేలిపోయింది. విచారణ అధికారి పదిమంది అధికారులు పర్మనెంట్, మరో ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే అధికారులకు ఉద్యోగ పదోన్నతి, ఇంక్రిమెంట్ నిలుపుచేస్తూ నిలుపుదల చేస్తూ దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ముగ్గురు ఏఈఓ లకు ఇంక్రిమెంట్ కట్ చేస్తూ నష్టపరిహారాన్ని ఆర్థిక రూపంలో చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. రాజన్న ఆలయంలో అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని లేనియెడల ఎంతటి వారైనా కఠిన చర్య తీసుకుంటామని ఇన్చార్జి యువ కృష్ణ ప్రసాద్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement