Friday, November 22, 2024

Corruption – తెలంగాణ వ‌ర్శిటీలో ఎసిబి, విజిలెన్స్ దాడులు ..

నిజామాబాద్ జిల్లా ప‌రిధిలోని తెలంగాణ యూనివ‌ర్సిటీలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వ‌హించారు. వ‌ర్సిటీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో సోదాలు చేశారు. ఈ నెల 3వ తేదీన‌ నిర్వహించిన పాలకమండలి సమావేశంలో టీయూ పరిణామాలు, గతంలో పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకషంగా చర్చించారు.ఈ సమావేశంలో వీసీ చేసిన అక్రమాలపై విచారణ కమిటీ వేయాలని పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

దీనిలో భాగంగానే నేడు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు నిర్వ‌హించిన‌ట్లు అధికారులు తెలిపారు. అకౌంట్ సెక్ష‌న్, ఏవో సెక్ష‌న్, ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్ష‌న్ల‌లో సోదాలు నిర్వ‌హించారు. యూనివ‌ర్సిటీలోని క‌ళాశాల భ‌వ‌నాల్లోనూ విజిలెన్స్ దాడులు చేశారు.
వీసీ చేసిన అక్రమ నియామకాలు, ఇతరుల పేర్ల మీద బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన వైనం, దినసరి ఉద్యోగం కింద పనిచేసిన వారికి ఈసీ అనుమతి లేకుండానే బ్యాంకు నుంచి రూ. 28 లక్షలు చెల్లించిన అంశాల ఈ రెండు శాఖ‌లు ఆరా తీసున్నాయి..ఇప్ప‌టికీ వ‌ర్శిటీలో వివిధ విభాగాల‌లో త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి.. ఏ మేర‌కు అవినీతి జ‌రిగింద‌నే వివ‌రాలు ఎసిబి అధికారులు నేడు వెల్ల‌డించే అవ‌కాశాలున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement