Friday, November 22, 2024

TS | ఏసీబీ వలలో మాదాపూర్ ఎస్ఐ..

మాదాపూర్ పోలీస్ స్టేషన్ అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. లంచం తీసుకుంటుండగా మాదాపూర్ ఎస్ఐ రంజిత్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ రంజిత్ తో పాటు రైటర్ విక్రమ్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిద్దరినీ అధికారులు విచారిస్తున్నారు.

మాదాపూర్ సాయి న‌గ‌ర్‌లో ల‌క్ష్మ‌ణ్ నాయ‌క్ ఇంటి నిర్మాణం చేప‌ట్టారు. త‌న స్థ‌లంలో ఇల్లు క‌డుతున్నాడ‌ని ల‌క్ష్మ‌ణ్‌పై సుధా అనే మ‌హిళ ఫిర్యాదు చేసింది. సుధా ఫిర్యాదు మేర‌కు ల‌క్ష్మ‌ణ్ నాయ‌క్‌పై కేసు న‌మోదు చేశారు. అనంత‌రం పోలీసు స్టేష‌న్‌కు రావాలంటూ ఎస్ఐ రంజిత్, రైట‌ర్ విక్ర‌మ్ క‌లిసి ల‌క్ష్మ‌ణ్‌కు ఫోన్ చేశారు.

రూ.ల‌క్ష ఇవ్వాల‌ని ల‌క్ష్మ‌ణ్ నాయ‌క్‌ను డిమాండ్ చేశారు. డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే ల‌క్ష్మ‌ణ్ కూతురు, అల్లుడిపై కేసు న‌మోదు చేస్తామ‌ని ఎస్ఐ బెదిరించాడు. దీంతో ఎస్ఐ, రైట‌ర్‌పై ల‌క్ష్మ‌ణ్ ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదు చేశాడు. ఇక రెండు రోజులుగా మాదాపూర్ పీఎస్ సిబ్బంది అవినీతిపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు… పక్కా ప్లాన్ ప్రకారం ఎస్ఐ రంజిత్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement