హైదరాబాద్, ఆంధ్రప్రభ : అందరికి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రణాళికాయుతంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమ కార్యక్రమాలతో జాతీయ ఆరోగ్య సూచికలలో తెలంగాణ రాష్ట్ర్రం గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ తేడా 2014తో పోల్చితే స్పష్టంగా కనిపి స్తున్నది. ఒక లక్ష ప్రసవాలకు 2014లో 92 ఉన్న మాతృ మరణాలు 2022 నాటికి 56కు తగ్గాయి. 2014లో 39 ఉన్న శిశు మరణాలు, 2022 నాటికి 23కి తగ్గాయి. 2014లో 5 సంవత్సరాలల లోపు ఉన్న పిల్లల మరణాలు 41 ఉంటే, 2022 నాటికి ఆ సంఖ్య 30కి పడిపోయింది. అదే పీరియడ్లో 25 ఉన్న బాలింత మరణాల 16కు తగ్గాయి. ఇమ్యునైజేషన్ వాక్సిన్ విషయానికి వస్తే 2014లో 68 శాతం ఉంటే, 2022 నాటికి 100 శాతంకు చేరింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య 2014లో 30 శాతం ఉంటే అది 2022 నాటికి 56 శాతానికి పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో జరుగుతున్న ప్రసవాల సంఖ్య98 శాతంకు పెరిగింది. అన్ని ఆరోగ్య సూచికలలో తెలంగాణ రాష్ట్ర్రం జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉంది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచిల్లో తెలంగాణ రాష్రం కేరళ, తమిళనాడు తరువాత 3వ స్థానానికి చేరింది. తలసరి ప్రభుత్వం చేస్తున్న వైద్య ఖర్చులో రూ.1,698లతో హిమాచల్‌ప్రదేశ్, కేరళ తరువాత తెలంగాణ రాష్ట్రం నిలచింది. 2022-23 బడ్జెట్‌లో దానిని రూ.3,091లకు పెంచారు. అలాగే, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన హెల్త్ ఫిట్‌నెస్ క్యాంపెయిన్‌లో 3 కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా, తెలంగాణ రాష్ట్రం 3 అవార్డులు సాధించి అగ్రస్థానంలో నిలచింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్షించిన సర్వేజన సుఖినోభవంతు నినాదం మేరకు రాష్ట్ర ప్రభు త్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా జనహిత కార్యక్రమాలు చేపట్టింది. వైద్య సదుపాయాల విస్తరణ, నిరంతర మానిటరింగ్‌తో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమ పథకాలు-కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి పథకాల సమ్మిళిత ఫలితాలే జాతీయ స్థాయిలో తెలం గాణ సాధించిన ఆరోగ్య సూచికలుగా పేర్కొనవచ్చు.
హెల్త్ హబ్‌గా హైదరాబాద్ నగరం అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉన్నది. దేశ విదేశీ ప్రజలు వైద్య సేవలకు హైదరాబాద్ వస్తుండటం వల్ల హెల్త్ టూరిజం బాగా విస్తరించింది. గతంలో మూడంచెలు ప్రాథమిక సేవలకు ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు, ద్వితీయ స్థాయి సేవలకు జిల్లా ఆసుపత్రులు, స్పెషాలిటీ సేవలకు మెడికల్ కాలేజీలుగా ఉన్న వైద్య సేవలు వ్యవస్థకు అదనంగా ప్రివెంటివ్ సేవలకు బస్తీ, పల్లె దవాఖానాలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు టిమ్స్‌తో 5 అంచెలు వ్యవస్థగా మార్చి ప్రజల ముంగిటకే ప్రాథమిక వైద్యాన్ని, పేదలకు అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక సెంట్రల్ డయాగ్నస్టిక్స్ లేబరేటరీని ఏర్పాటు చేశారు. మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెప లప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర్రవ్యాప్తంగా నెలకొల్పిన ప్రభుత్వ డయాగ్నస్టిక్ కేంద్రాలలో జరుగుతున్న రోగ నిర్ధారణ పరీక్షలను మానిటరింగ్ చేస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సౌలభ్యం కోసం 42 డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పింది. ఈ కేంద్రాల సంఖ్యను 102కు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. డయాలసిస్ కేంద్రాలకు రోగులు వచ్చిపోయేందుకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిం చింది. రాష్ట్రవ్యాప్త్‌ంగా 21 ఆసుపత్రులలో సిటి స్కాన్ సేవలు అందు బాటులోకి వచ్చాయి. గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు నిర్వహణకు హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ లలో క్యాథ్ ల్యాబ్‌లను ప్రభుత్వం నెలకొల్పింది. ప్రభుత్వ ఆసుప త్రులలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రతి బెడ్‌కు ఇస్తున్న ఖర్చును రూ.5000 నుంచి రూ.7500కు పెం చడం జరిగింది. సాధారణ రోగులకు ఇచ్చే డైట్ చార్జీలను రోజుకు రూ.40 నుంచి రూ.80కి పెంచడం జరిగింది. అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా నిర్వహించిన కంటి వెలుగు 2వ దశ కార్యక్రమం కింద ఇప్ప టి వరకు 1 కోటికి చేరువలో కంటి పరీక్షలు చేసి దృష్టి లోపం ఉన్న వారికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ వైద్యంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు వేలాది రూపాయలు ఆదా అవుతున్నాయి.