Saturday, November 23, 2024

ఆదిలాబాద్​ ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్య సదుపాయాలు: మంత్రి హరీశ్​

ఉమ్మడి ఆదిలాబాద్‌ బ్యూరో, (ప్రభన్యూస్‌) : వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు అందించేందుకే సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రిని ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు. గురువారం అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి రూ. 150 కోట్లతో నిర్మించిన సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్​ను ప్రారంభించారు. జి ల్లాలోని గిరిజన ప్రాం తాలకు మెరుగైన వైద్య సేవలు విస్తరిస్తామని బస్తీ దవఖానాల్లోను సౌకర్యాలు మెరుగుపరుస్తా మన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యవిధానంపై కేంద్రప్రభుత్వం కూడ ప్రశంసలు కురిపిస్తుందని అన్నారు. నర్సింగ్‌ కళాశాలలో పోస్టులను బర్తీ చేస్తామని అన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టుల బర్తీకి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. రిమ్స్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌ రావ్‌ మాట్లాడారు. ప్రజల జీవన ప్రమణాలను మెరుగుపర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు జాతీయ దృష్టిని ఆకర్శిస్తున్నాయని అన్నారు.భారతీయ జనతాపార్టీ అబద్దపు మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

ఆదిలాబాద్‌లో మూతపడి ఉన్న ఆదిలాబాద్‌ సీసీఐ సిమెంట్‌ ఫ్యాక్టరీని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బిజెపి సీసీఐని తెరిపిం చాలని డిమాండ్‌ చేశారు. సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి నిర్వహణకు ప్రతీ ఏటా రూ. 50 కోట్లు ఖర్చు అవుతుందని, అట్టి నిధులనుబడ్జెట్‌లో పెట్టి విడుదలచేస్తామని అన్నారు. లివర్‌ , కిడ్ని గుండె వ్యాధు లకుసంబంధించిన చికిత్సను ఆరోగ్యశ్రీలో రూ. పది లక్షల వరకు పరిమితిని పెంచుతామని అన్నారు. ప్రతీ నెల ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రి పనితీరును సమీక్షిస్తామని అన్నారు.వైద్యసేవలు అందించేందుకు ముఖ్యమంత్రి ఎంతో చొరవ చూపుతున్నారని ఆయన ఆదేశానుసారం వైద్య సేవలు అందిస్తామని అన్నా రు.ఆదిలాబాద్‌ సూపర్‌ స్పెషాలిటి హాస్పిటల్‌లో ప్రత్యేక వైద్య నిపుణులను నియమిస్తామని అన్నారు. కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన 150 మెడిక ల్‌ కళాశాలల్లో తెలంగాణ కు ఒక్క కళాశాల కూడ కేటా యించకపోవడం దారుణమని అన్నారు. ఎయిమ్స్‌, ఐఐటి , త్రిబుల్‌ ఐటి ల మంజూరులో తెలంగాణకు అన్యాయం చేశారని అన్నారు. కేంద్రప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. నవోద య పాఠశాలలు మంజూరు చేయాల్సి ఉండగా ఇతర రాష్ట్రాల్లో మంజూరు చేసి తెలంగాణకు మొండి చేయిచూపారని అన్నారు. బయ్యారం గిరిజన యూనివర్సిటి , బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ గిరిజన యూని వర్సిటి , వరంగల్‌ రైల్వే కోచ్‌,ఆదిలాబాద్‌ సిసిఐ ఇలా ఎన్నో పెండింగ్‌ ఉన్నప్పటికి కేంద్రం మంజూరు చేయలేదని బిజెపి నేతలను ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement