Tuesday, November 26, 2024

రోగం చిన్న‌దైనా….పే….ద్ద బిల్లు…

హైదరాబాద్‌, : చిన్నపాటి చలి జ్వరం, తల నొప్పి, కడుపు నొప్పితో వెళ్లినా… మూత్ర, రక్త, ఎక్స్‌ రే, అవసరమైతే సీటీ స్కాన్‌, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ పరీక్షలతో రోగుల జేబులను ప్రయివేటు, కార్పోరేటు ఆస్పత్రులు గుల్ల చేస్తున్నాయి. అవసరం లేకున్నా… పలు రకాల డయాగ్నస్టిక్‌ పరీక్షలకు రిఫర్‌ చేస్తున్న వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రయివేటు ఆస్పత్రుల్లో సాధారణమై పోయింది. ఆయా ప్రాంతాల్లో పేరొందిన ప్రయివేటు/ కార్పోరేటు ఆస్పత్రులు, సీనియర్‌ వైద్యులు కూడా ఈ దందాకు ఎలాంటి శషబిషలు లేకుండా సహకరిస్తున్నారు. ఫలితంగా తలనొప్పి, ఒంటి నొప్పులు, చలి జ్వరంతో వెళ్లినా రోగులు వేలల్లో బిల్లు చెల్లించాల్సి వస్తోంది. ప్రయివేటు, కార్పోరేటు ఆస్పత్రుల్లో చేయించుకున్న రోగం చికిత్స చిన్నదైనా… చెల్లించాల్సిన బిల్లు వేలల్లో, చాలా సార్లు లక్షల్లోనూ ఉంటోంది. రూ.10తో పోయే చికిత్సకు రూ.10 వేల దాకా బిల్లు అయ్యేలా చేస్తున్నారు. ప్రయివేటు, కార్పోరేటు ఆస్పత్రుల యాజమాన్యాల చోర నైపుణ్యం ఒక్క రోగం… ఆరు టెస్టులు అన్న చందంగా యథేచ్ఛగా కొనసాగుతోంది. అది హైదరాబాద్‌లోని కార్పోరేటు ఆస్పత్రి అయినా, జిల్లా కేంద్రా ల్లోని పేరొందిన ప్రయివేటు ఆస్పత్రి అయినా… ఒక్కసారి ఆ ఆస్పత్రుల గడపతొక్కిన రోగులు కచ్చితంగా లక్షల్లో బిల్లు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్‌తోపాటు పలు జిల్లా, రెవెన్యూ కేంద్రాల్లో ప్రయివేటు, కార్పోరేటు ఆస్పత్రులు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. చిన్న మండల కేంద్రంలోనూ కార్డియాలజీ ఆస్పత్రులు వచ్చేశాయి. సిటీ స్కాన్‌ చెకప్‌లు కూడా అందు బాటులోకి వచ్చాయి. ఇదంతా రోగులకు తక్కువ వ్యయానికే మెరుగైన వైద్య సేవలు అందించేందుకే అనుకుంటే పొరపాటే. ఆస్పత్రి ప్రారంభించే ముందు కార్పోరేటు, ప్రయివేటు ఆస్పత్రులు ప్రభుత్వం నుంచి పలు రకాల మినహాయింపులు, ప్రోత్సాహకాలు పొందుతున్నాయి. పేదలకు తక్కువ వ్య యానికే మెరుగైన చికిత్సను అందిస్తామని అనుమతి పత్రం కోసం చేసుకున్న దరఖాస్తులో వాగ్దానం చేస్తున్నాయి. ఒక్క సారి అనుమతి వచ్చాక… ఇక రోగులను ఆర్థికంగా పీల్చి పిప్పి చేయడం, అందినకాడికి దండుకోవడమే పనిగా పెట్టుకుని పనిచేస్తున్నాయి. చిన్న నొప్పికి కూడా పెద్ద పెద్ద టెస్టులు రిఫర్‌ చేస్తూ రోగు ల వద్ద నుంచి డబ్బులను కార్పోరేటు, ప్రయివేటు ఆస్పత్రులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. చిన్నపా ము ను కూడా పెద్ద కర్రతో కొట్టాలి. అనే సామెతను వైద్యం కోసం వచ్చిన రోగులను ఆర్థికంగా దోచుకునేందుకు ప్రయివేటు, కార్పో రే టు ఆస్పత్రులు పక్కాగా అనుసరిస్తున్నాయి. తల నొప్పికి ఎంఆర్‌ఐ స్కాన్‌, కడుపునొప్పికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ పరీక్షలను రాస్తున్నారు. బయట టెస్టులు చేయించుకుని ఆ రిపోర్టులతో వెళ్లినా… మళ్లిd మొదటి నుంచి చైన్‌ సిస్టంలో అన్ని డయా గ్న స్టిక్‌ టెస్టులు రాస్తున్నారు. పైగా ఐసీయూ ఛార్జీలు, ఇన్‌పే షెంట్‌ ఛార్జీలు ఇలా చిత్ర, విచిత్రమైన ఫీజులు వసూలు చేస్తు న్నారు. కడుపునొప్పితో వెళ్లిన రోగులకు ఐసీయూ స్థాయి వైద్యం చేస్తున్నారు.
ముందుగా అనుమాన బీజం నాటుతారు
ఏ రోగానికైనా ముందు ట్యాబ్లెట్లు రాయాలి. వాటితో తగ్గకపోతే టెస్టులు, సీనియర్‌ వైద్యులతో చికిత్స అవసరం ఉం టుంది. అయితే అలా జరగడం లేదు. ”ముందుగా పేషెంట్‌ను పరీక్షిస్తారు. రోగం లక్షణాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత కొన్ని మందులు రాస్తారు. అక్కడితో ఊరుకోకుండా… ఆ వ్యా ధి లక్షణాలు ఉన్నాయి… అయిండొచ్చు. ఇప్పుడే టెస్టులు అవ సరం లేదు. కానీ చేయిస్తే మంచిది. అంటూ అనుమానాన్ని కలి గిస్తారు. దీంతో రోగి తప్పకుండా ఖరీదైన టెస్టులను చేయిం చుకోవాల్సిందే. తలనొప్పి వెళితే… మెదడులో కణితులుం డొ చ్చు, రక్తం ఫ్లాట్‌ అయి ఉండొచ్చు, కడుపునొప్పితో వెళితే… అపెండిక్స్‌, గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్యలు అంటూ లేనిపోని అనుమానాలు కలిగిస్తారు. అవసరం లేకపోయినా మూత్ర, రక్తపరీక్షలు, సీటీ స్కాన్‌, ఎక్స్‌ రే, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ తదితర టెస్టులు రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తమ ఆస్పత్రుల్లోనే ల్యాబ్‌లు, సిటీస్కాన్‌ తదితర యంత్రాలు ఏర్పాటు చేసుకోవడం, లేదంటే బయటి డయాగ్నస్టిక్‌ సెంట ర్లతో కుమ్మక్కై అనవసర టెస్టులను చేయిస్తున్నారు.
సర్కారీ వైద్యంపై అపోహలు… ప్రయివేటు ఆస్పత్రులకు కాసులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంకల్పం, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కృషితో సర్కారు దవాఖానాలు మెరుగ్గానే పనిచేస్తున్నాయి. ఎంతో అనుభవుజ్ఞులైన సీనియర్‌ వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్నారు. దీంతో మెరుగైన వైద్యం కూడా అందుతోంది. అయితే ఈ విషయంలో సరైన ప్రచారం లేకపోవడంతో… ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకు నేందుకు ఇప్పటికీ చాలామంది ప్రజలు ముఖం తిప్పుకుంటు న్నారు. దీంతో ఈ సదావకాశాన్ని ప్రయివేటు, కార్పోరేటు ఆస్పత్రులు మెరుగైన వైద్యం పేరుతో క్యాష్‌ చేసుకుం టున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement