హైదరాబాద్, : ఇప్పటికే సెకండ్‌వేవ్‌తో అల్లకల్లోలం అవుతున్న మహారాష్ట్రలో జూన్, జులై నెల్లో థర్డ్ వేవ్ విరుచుకుపడే ప్రమాదముందని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే జరిగితే తెెలుగు రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ సులువుగా వ్యాప్తి చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబరులో థర్డ్ వేవ్ విరుచుకుపడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా సెకం డ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, ఈ పరి స్థితులు అనివార్యమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా సెకం డ్‌వేవ్‌తో రాష్ట్రం అల్లకల్లోలమవుతోంది. ఈ తరుణంలో థర్డ్ వేవ్ కూడా అని వా ర్యమని వస్తున్న వార్తులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే థర్డ్ వేవ్ ఏ నె లలో, ఏ సమయంలో వ్యాప్తి చెందుతుందన్న అంశంపై కచ్చితమైన అంచనాలు లేవు. వైరస్ మ్యుటెంట్లు వేగంగా జరుగుతున్నందునే థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది.
ఎన్440కే కొత్త వేరియంట్ కాదు: సీసీఎంబీ
కరోనా కొత్త వేరియంట్ ఎన్440కే వేరియంట్ కొత్తది కాదని సీసీఎంబీ స్ప ష్టం చేసింది. ఎన్440కే వేరియంట్‌పై క్లారిటీ ఇస్తూ గురువారం ట్వీట్ చేసింది. కరోనా వేరియంట్లలో ఎన్440కే కొత్త వేరియంట్ అని వార్తలు వస్తున్న నేపథ్యం లో గతేడాది కూడా ఈ వేరియంట్‌ను గుర్తించామని తెలిపింది. ఎన్440కే వైర స్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయినట్లు తమ పరిశోధనల్లో తేలిందని, గతేడాది దక్షిణాదిలో ఈ రకం వేరియంట్ వ్యాప్తిని గుర్తించినట్లు సీసీఎంబీ చెప్పింది.
ఎన్440కే తగ్గుముఖం… డబుల్‌మ్యుటెంట్ వేరియంట్లు రంగ ప్రవేశం
తెలంగాణలో కరోనా వైరస్ అడ్డూ అదుపు లేకుండా విస్తరిస్తోంది. పాజిటివ్ కేసుల్లో అనూహ్య పెరుగుదలకు ఎన్440కే వేరియంటే కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్440కే వేరియంట్ తగ్గుముఖం పడుతుండగా… దాని స్థానంలో కొత్తగా బీ1677, బీ1617 డబుల్ మ్యుటెంట్ విజృంభిస్తోందని అని నిపుణులు తేల్చారు. రాష్ట్రంలో 83శాతం వైరస్ వ్యాప్తిమహారాష్ట్ర వేరియంట్ బీ1617 కారణంగానెెనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డా. కిరణ్ మాదల చెప్పారు.
సెప్టెంబరులో థర్డ్ వేవ్…
Advertisement
తాజా వార్తలు
Advertisement