Friday, November 22, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క‌రోనా ప‌రీక్ష‌లు…

హైద‌రాబాద్ – క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండ‌టంతో దేశంలోని అన్ని విమానాశ్ర‌యాల‌లో తిరిగి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.. దీనిలో భాగంగానే శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో క‌రోనా ప‌రీక్ష‌ల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అంతర్జాతీయ ప్రయాణకులను పరీక్షించేందుకు థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి వందమంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే వారికి మాత్రం కరోనా పరీక్షలు, ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. అయితే, కరోనా లక్షణాలున్నట్టు అనిపిస్తే మాత్రం మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అలాగే విమానాశ్ర‌యంలో అడుగుపెట్టే ప్ర‌యాణీకుల బంధువులు, స్నేహితుల సంచారంపై ఆంక్ష‌లు విధించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement