Tuesday, November 26, 2024

కరోనా కట్టడిలో మేమే ముందు..

కేంద్ర ఆరోగ్యమంత్రి ప్రశంసే నిదర్శనం
ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యం
అన్ని చర్యలు తీసుకుంటున్నాం
10 లక్షల మందికి వ్యాక్సిన్‌ పూర్తి
రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల నిల్వలున్నారు
ఆస్పత్రుల్లో బెడ్‌ల సంఖ్య పెంచాం
ఆక్సిజన్‌ డిమాండ్‌ సరఫరాపై ఆడిటింగ్‌ చేస్తున్నాం
బ్లాక ఫంగస్‌కు కూడా మందులు తెప్పిస్తున్నాం
60 లక్షల ఇళ్లలో జ్వర సర్వే చేశాం
కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సమావేశం అనంతరం మీడియాతో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, : ప్రజల ప్రాణాలు కాపాడేం దుకు అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేప డుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని, ఈ విష యంలో స్వయంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి తమను అభినందించారని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన కొవిడ్‌ వ్యాక్సిన్‌, మందుల సేకరణ, సరఫరా అంశాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ తొలి సమా వేశంలో కేటీఆర్‌ పాల్గొని అధికారులతో చర్చించారు. సమావేశం అనంతరం సచివాలయం బీఆర్కేభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెకండ్‌వేవ్‌ విషయంలో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు. కరోనా కట్టడికి చర్యలను ముమ్మరం చేస్తున్నామని, మరింత సమగ్ర కార్యాచరణతో ముందుకుపోతామని చెప్పారు. జిల్లాల్లో కోవిడ్‌ నియంత్రణ చర్యలకు మంత్రులు కృషి చేస్తున్నారని, అధికారులు వారితో సమన్వయం చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ డిమాండ్‌ సరఫరాల వివరాలు తీసుకున్నామని, ప్రైవేటు ఆస్పత్రులు అవసరమైన మేరకే ఆక్సిజన్‌ వాడేలా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో 45 ఏళ్లకుపైబడిన వారు 92 లక్షల మంది ఉండగా 38 లక్షల మంది ఇప్పటికే ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నారన్నారు. వీరిలో 10 లక్షల మంది రెండవ డోసు పూర్తి చేసుకున్నారని చెప్పారు. వ్యాక్సిన్‌ ప్రజలందరికీ అందించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను ప్రారంభించిందని, త్వరలో వ్యాక్సిన్‌ తయారీదారులతో సమావేశమవుతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్‌లు భారీగా పెంచామన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా బెడ్‌ల సంఖ్య పెరిగిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.5 లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌లు ఉన్నాయని, మరిన్ని సరఫరాకు కంపెనీలతో సమన్వయ ం చేసుకుంటామని చెప్పారు. దీంతో పాటు రోగులు సీరియస్‌గా ఉన్నపుడు అత్యవసర పరిస్థితుల్లో వాడుతున్న టోలిసిజుమాబ్‌ వంటి మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించామన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ విషయంలోనూ ప్రభుత్వం అలర్ట్‌గా ఉందని, దీనికి అవసరమైన మందులను కూడా సేకరిస్తున్నామన్నారు. కోవిడ్‌ కాల్‌సెంటర్‌ రాష్ట్రవ్యాప్తంగా ఒకే నెంబర్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో జ్వర సర్వే పూర్తయిందని, ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నంతో వేలాది మందికి ప్రాథమిక దశలోనే మందులిచ్చి కాపాడగలుగు తామని చెప్పారు. హోం ఐసోలేషన్‌ పేషెంట్‌లకు ఇచ్చే మందులకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. కేటీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, కొవిడ్‌పై సీఎంఓ ప్రత్యేక అధికారి రాజశేఖర్‌ రెడ్డి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌, వికాస్‌రాజ్‌, సందీప్‌ సుల్తానియా, లైఫ్‌సైన్సెస్‌ అండ్‌ ఫార్మా డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement