సీఎం కేసీఆర్ దూరదదృష్టి
27 వేల మెడికల్ టీమ్‌ల ఏర్పాటు
తగ్గిన మరణాలు
కట్టడిలో కీలకంగా మారిన సర్వే
ఇప్పటికే 70 శాతం సర్వే పూర్తి
1.75 లక్షల మందికి మెడికల్ కిట్లు అందజేత
తెలంగాణ బాటలోనే కేంద్రం
ఇదే పంథా దేశమంతా
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వరసర్వే సత్పలితాలనిస్తోంది. ఈ జ్వరసర్వే కారణంగానే.. లక్షన్నరకు పైగా జ్వరపీడితులు, కరోనా లక్షణాలున్నవారిని గుర్తించినా.. ఇంటి స్థాయిలోనే దానిని కట్టడి చేసి కోలుకునే మార్గం చూపింది. ప్రతి ఇంటికీ వైద్యబృందాలను పంపితే.. అసలు లెక్క తేలుతుందని, ఇంటి స్థాయిలోనే కరోనా కట్టడి వీలవు తుందని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. లాక్‌డౌన్‌కు ముందే ఇంటి ంటి సర్వేకు ఆదేశించగా, విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 16 జిల్లాల్లో ఈ సర్వే ముగియగా, ఈ వారంలో మొత్తం అన్ని జిల్లాల్లో పూర్తయ్యే అవకాశముంది…
హైదరాబాద్, తెలంగాణలో చేపట్టిన ఇంటింటి సర్వే సత్పలితాలు ఇస్తుండడం, క్షేత్రస్థాయిలోనే కట్టడికి దోహదపడుతుండడంతో.. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రా ల్లోనూ ఇదే తరహా ఇంటింటి సర్వే చేపట్టాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో పుట్టిన అనేక పథకాలు, ఆలోచనలు దేశవ్యాప్త అమలు గతంలో జరగ్గా.. ఇపుడు కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ తెలంగాణ ఆలోచన దేశానికి ఉపయోగపడుతోంది. ఇంటింటి ఆరోగ్యసర్వే కారణంగా.. సకాలంలో వైద్య సేవలు అందు తుండడంతో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.
27,171 బృందాలు
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో.. 1,02,16,079 ఇండ్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు 72,10,088 ఇండ్లలో సర్వే పూర్త యింది. మొత్తం 16 జిల్లాల్లో సర్వే పూర్తికాగా, ఇంకా 30శాతం సర్వే చేయాల్సి ఉంది. ఈ వారంలో సర్వే పూర్తవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 27,171 సర్వే బృం దాలు పనిచేస్తున్నాయి. ఇం దులో గ్రామపం చాయతీ లలో 22,011, జీహెచ్ ఎంసిలో 1,410, ఇతర మునిసిపాలిటీలలో 3,750 బృందాలు సర్వే నిర్వహిస్తు న్నాయి. మరో వారంలో ఈ సర్వే పూర్తికానుంది. స్వల్ప లక్షణా లున్న వారికి.. ఈ సర్వే కారణంగా అద్భుత ఉప యాగం జరుగుతుండగా, పరిస్థితి సీరియస్‌గా ఉన్నవారిని కూడా ఈ వైద్యబృందాలు గుర్తించి.. హుటాహుటిన ఆస్పత్రు లకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇంటింటి సర్వే కరోనా సమ యంలో.. సాహసమే కాగా, ప్రభుత్వ నిర్ణయం.. ఆరోగ్య బృందాల కృషి పల్లెల్లో.. ఇళ్ళల్లోనే కట్టడికి దోహదపడు తోంది. ప్రతి వేయి ఇండ్లకు ఒక టీమ్‌ను ఏర్పాటుచేయగా, సీఎం కేసీఆర్ ప్రణాళిక సత్పలితాలను ఇస్తోంది. పల్లెల్లో ఈ బృందాల పనితీరుపై ప్రజల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. పల్లెల్లో ఈ టీమ్‌లో గ్రామపంచాయతీ కార్యదర్శితో పాటు ఎఎన్ఎం, ఆశ, అంగన్వాడీ వర్కర్లు ఉండగా.. పట్టణాల్లో పంచాయతీ సిబ్బంది స్థానంలో మునిసిపల్ సిబ్బంది ఈ టీమ్‌లో ఉన్నారు. ఆరోగ్యబృందాల పనితీరు, ఆలోచన విప్లవాత్మకమని వైద్యరంగ నిపుణులు అంటున్నారు.
70శాతం సర్వే పూర్తి
గత పదిరోజులుగా ఇంటింటి ఆరోగ్యసర్వే జరుగుతుండగా ఇప్పటికి 70శాతం పూర్తయి ంది. 72లక్షల ఇండ్లలో సర్వే పూర్తి కాగా, ఇంకా గణాంకాల ప్రకారం 30 లక్షల కుటుంబాల సర్వే జరగాల్సి ఉంది. వారం రోజుల్లో ఈ సర్వే పూర్తి కానుంది. సర్వే సందర్భ ంగా ఇంట్లోని వ్యక్తులెవరి కైనా జ్వరం లేదా ఇతర లక్షణాలు గుర్తిస్తే అక్కడికక్కడే మెడికల్ కిట్లు అందజేస్తు న్నారు. ఇంటింటి సర్వే ద్వారా 1.75లక్షల మందికి ఈ మెడికల్ కిట్లు అందించగా, ఓపిల ద్వారా మరో 75వేల మందికి ఈ కిట్లు అందాయి. ఈ కిట్ల ద్వారా ప్రాథమిక స్థాయి లోనే.. వైద్యం అందుతుండగా, ఇంటింటి సర్వేలో ఆరోగ్య బృందాలు కేసు తీవ్రతను బట్టి చికిత్స అందిస్తున్నాయి. సూచనలు చేస్తున్నాయి. సకాలంలో విలువైన ప్రాణాలు కాపాడబడుతు న్నాయి.
ఈ ఇంటింటి సర్వే జరగకుంటే.. తెలంగాణలో ప్రస్తుతము న్న వైద్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనయ్యేది. మరణాల రేటు తీవ్రంగా ఉండేది. సమస్యను మూలాల్లోంచి ఆలోచించే సీఎం కేసీఆర్.. కరోనా నేపథ్యంలో ఇంటినుండే ప్రారం భించిన చికిత్స ప్రాథమిక స్థాయిలో కట్టడికి కారణ మవుతోంది.