సూర్యాపేటలో డీఎంహెచ్‌వో కోటా చలంతో పాటు ఆయన కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బుధవారం కొవిడ్ పరీక్షలు చేయించుకున్న డీఎంహెచ్‌వో కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ముందు డీఎంహెచ్‌వో భార్య, కుమారుడు, కోడలుకు పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం కొవిడ్ పరీక్ష చేయించుకున్న కోటాచలంకు కరోనా సోకినట్టు తేలింది. డీఎంహెచ్‌వో కుమారుడు 5 రోజుల క్రితమే జర్మనీ నుంచి వచ్చాడు. కాగా, ఆయన కుటుంబం రెండ్రోజుల క్రితం తిరుపతి వెళ్లి రావటం ఇప్పుడు మరింత ఆందోళ కలిగిస్తోంది. మరోవైపు డీఎంహెచ్‌వో కోటాచలం.. నిన్న ఎయిడ్స్‌డే కార్యక్రమంలో పాల్గొని… వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించారు. ఆయనకి కరోనా పాజిటివ్‌గా తేలటంతో నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఆందోళన నెలకొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement