పఠాన్ చెరు, ( ప్రభ న్యూస్) : సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం రేగింది. గత నెల 28న ముత్తంగి బీసీ బాలికల వసతి గృహంలో 42 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలికి కొవిడ్ పాజిటీవ్ వచ్చిన సంగతి తెలిసిందే.. ఇది మరువక ముందే పఠాన్ చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశంలోని బాలికల హాస్టల్‌లో 25మందికి పాజిటివ్‌గా రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వసతి గృహంలో గురువారం మధ్యాహ్నం పలువురికి ఆర్‌టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు.. ఇక పాజిటివ్ వచ్చిన వారిని వసతి గృహంలోనే ఐసొలేషన్ ఏర్పాటు చేసి అందులోకి తరలించారు.