Tuesday, November 26, 2024

టెక్ మహీంద్రాలో కరోనా కలకలం.. 25 మంది విద్యార్థులతోపాటు టీచింగ్ స్టాఫ్‌కి..

కుత్బుల్లాపూర్, ( ప్రభ న్యూస్) : కొవిడ్ సమస్య సమిసిపోయిందనే అతి విశ్వసమో.. లేక సెకండ్ డోస్ వేసుకున్నాం అన్న నిర్లక్షమో కాని టెక్ మహీంద్రా యూనివ‌ర్సిటీలో కరోనా విజృంభించింది.. ఒకేసారి 25 మంది విద్యార్థులు, అయిదుగురు టీచింగ్ స్టాఫ్ కు పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో మహీంద్రా యూనివర్సిటీ వార్తలో నిలిచింది. కాగా, వర్శిటీ కి యాజమాన్యం మూడు రోజులు సెలవు ప్రకటించగా విద్యార్థులందరిని హోమ్ ఐసోలేషన్‌కు తరలించినట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు..

ఇలా గుర్తించారు..
టెక్ మహీంద్రా యూనివర్సిటీ లోని ఓ విభాగానికి చెందిన ఇద్దరు విద్యార్థులకు జ్వరం వచ్చింది. రెండు, మూడు రోజులైనా తగ్గకపోవడంతో ఆస్ప‌త్రికి వెళ్ల‌గా కొవిడ్ లక్షణాలున్నట్లు వైద్యులు అనుమానించారు.. దీంతో దుందిగల్ లోని ఆరోగ్య ఉప కేంద్రంలో సదరు విద్యార్థులకు కొవిడ్ టెస్టులు చేయించారు. వారికి పాజిటివ్ అని ధ్రువీకరించుకున్నాక జిల్లా ఉప వైద్యాధికారి నిర్మల క్యాంపస్ లో టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో 25 మంది విద్యార్థులకు, అయిదుగురు టీచింగ్ స్టాఫ్ కు పాజిటివ్ అని తేలింది.. వైద్యాధికారుల సూచన మేరకు టెక్ మహీంద్ర యూనివర్సిటీ 3 రోజుల పాటు సెలవు ప్రకటించింది.

క‌రోనా వాస్తవమే: నిర్మల, జిల్లా ఉప వైద్యాధికారి
టెక్ మహీంద్ర యూనివర్సిటీ విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం వాస్తవమే.. తొలుత ఇద్దరికి కరోనా టెస్టులు చేయగా వారికుందని తేలింది.. అనుమానంతో వారి సహచరులకు చేయగా 25 మంది విద్యార్థులతో పాటు అయిదుగురు టీచింగ్ స్టాఫ్ కి పాజిటీవ్ అని తేలింది..

ఉలిక్కిపడ్డ వ్యాపారస్తులు
టెక్ మహీంద్ర లో కరోనా కలకలం రేపడంతో టెక్ మహీంద్ర సమీపాన వ్యాపారం నిర్వహిస్తున్న హోటళ్లు, హాస్టళ్లు, టీ కోట్లు, కిరాణా షాపుల నిర్వహకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. టెక్ మహీంద్ర లో కొవిడ్ వచ్చిందన్న విషయం బయటకు పొక్కక పోవడం రోటీన్ గా శుక్రవారం కూడా సమీపాన వ్యాపారస్తులు తమ తమ షాపులు తెరిచేశారు.. శుక్రవారం రాత్రికి గాని టెక్ మహీంద్రా లో కోవిడ్ వచ్చిందన్న సంగతి తెలియకపోవడం తో వ్యాపారస్తులు ఆందోళనకు గురవుతున్నారు.

మున్సిపల్ కు తెలియక పోవడం విడ్డూరం..
బహుదూర్‌పల్లి లోని టెక్ మహీంద్ర యూనివర్సిటీ డీపీ పల్లిలోని దుండిగల్ మున్సిపాలిటీ కి కూతవేటు దూరంలోనే ఉంటుంది.. టెక్ మహీంద్ర లో కొవిడ్ పాజిటివ్ బాధితుల విషయం బయటకు పొక్కవద్దనే కారణంగానే యూనివర్సిటీ బాధ్యులు ఇటు వైద్యాధికారులకు, కానీ అటు మున్సిపల్ అధికారులకు కానీ ఎలాంటి సమాచారం చేరవేయలేదని తెలుస్తోంది.. యూనివర్సిటీ నిర్లక్ష్యం కారణంగా కొవిడ్ ఉధృతి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యాధికారులు తెలువుతున్నారు.

- Advertisement -

లక్షణాలు బయటపడగానే వైద్య, మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చి ఉంటే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపల్ నుండి సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని క్యాంపస్ పరిసరాలన్నీ శానిటేషన్ చేయించే పరిస్థితి ఏర్పడేది.. కానీ యూనివర్సిటీలో కొవిడ్ ప్రబలిందంటే ఎక్కడ తమ రేప్యుటేషన్ దెబ్బతింటుందో అన్న కోణంలో ఆలోచించి క్యాంపస్ లో తమకు తామే పరిసరాలు శానిటైజ్ చేయించినట్లు తెలుస్తోంది. తమ పరిసరాల పట్ల శ్రద్ద వహించిన యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో వారి పై దృష్టి పెట్టక పోవడం విడ్డూరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement