తెలంగాణలో కరోనా అంతకంతకూ పెరుగుతుండటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అటు విద్యా సంస్థల్లో కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మరో అంశం బయటికి వచ్చింది వేములవాడలో శివరాత్రి జాతర లో అత్యధిక భక్తులు పాల్గొన్నారు దీంతో ఆ జాతర కరోనా హాట్ స్పాట్ గా మారిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని అధిక కేసులు నమోదు అవుతుండడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. వీణవంక ఏఎస్సై కూడా కరోనాతో చనిపోయాడు. ఆ ఏఎస్ఐ కూడా వేములవాడ శివరాత్రి జాతరలో విధులు నిర్వహించాడు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్కూళ్లలో వచ్చిన కేసుల్లోనూ వేములవాడ కాంటాక్ట్ లు ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. వేర్వేరు ఊళ్లలో కేసులు వచ్చాయి. కానీ వీటన్నింటికి కామన్ లింక్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. చనిపోయిన ఏఎస్సై మొన్న శివరాత్రికి వేములవాడలో డ్యూటీ చేశారని సమాచారం. అటు గుడ్డేలుగులపల్లికి చెందిన కొందరు వేములవాడ వెళ్లొచ్చాకే.. అస్వస్థతకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు.
దీంతో వేములవాడ శివరాత్రి జాతర కరోనా హాట్ స్పాట్ అయ్యిందా అనే ఆందోళన మొదలైంది. దీంతో జాతరకు వచ్చి వెళ్లిన వాళ్లు అప్రమత్తంగా ఉండాలని, వారిని కాంటాక్ట్ అయిన వాళ్లు కూడా జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.