తెలంగాణ మీడియా అకాడమి జర్నలిస్టులకు అందించిన కొవిడ్ ఆర్థిక సహాయం మొత్తం 5కోట్ల 56 లక్షల 30 వేల రూపాయలకు చేరింది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కొవిడ్ బారిన పడిన జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ మీడియా అకాడమీ ఆదుకున్నదని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో కూడా 4 నెలల కాలంలో ఇప్పటికీ 77 మంది కరోనా బారిన పడిన వారికి 7. 70లక్షలు మంగళవారం బ్యాంకులో జమ చేయనున్నట్టు తెలిపారు. మొత్తం 3,909 మంది జర్నలిస్టులకు కరోనా సాయం అందించామని తెలిపారు.
‘‘రాష్టంలోని అన్నిరంగాలను ప్రభావితం చేసిన కరోనా జర్నలిస్టులను కూడా తీవ్రంగా ఇబ్బందులపాలు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం–శిక్షణ కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ జర్నలిస్టులకు ఎదురైన కరోనా ఇబ్బందులను కొద్ది మేరకైనా తొలగించడానికి ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఇప్పటి వరకు కరోనా సోకిన 3909 మంది జర్నలిస్టులకి 5 కోట్ల 56 లక్షల 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించింది’’ అని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్పేజీలను ఫాలో అవ్వండి..