Tuesday, November 26, 2024

తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నిన్న 2,295 కరోనా కేసులు నమోదయ్యాయి. 278 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 97.98 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ పేర్కొంది. రాష్ట్రంలో ఇంత వరకు 6,89,751 మందికి కోవిడ్ సోకింది. రాష్ట్రవ్యాప్తంగా 6,75,851 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,861 క్రియాశీల కేసులున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ తదితర కారణాలతో ఈరోజు ముగ్గురు మరణించటంతో ఇంతవరకు కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,039 కి చేరింది.

అయితే తాజాగా తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం రేపింది. బీఆర్కే భవనంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ లక్షణాలున్న ఉద్యోగులు పరీక్షలు చేసుకోగా అందులో మరో నలుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. బిల్డింగ్ లోని గదులన్నీ ఇరుకుగా ఉండటంతో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని ఉద్యోగులు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement