Friday, November 22, 2024

క‌రోనాతో టైర్ పంచ‌ర్….

హైదరాబాద్‌, : కరోనా కారణంగా రాష్ట్రంలో రవాణా రంగం కుదేలైంది. కరోనా విజృం భణ, లాక్‌డౌన్‌ కారణంగా సరుకు రవాణా వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అక్కడక్కడ నడుస్తున్నా ఆంక్షల కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో పరిశ్రమలు, నిర్మాణ రంగంతో పాటు పలు ఉత్పత్తి రంగాలు సగానికి సగం మూతపడ్డాయి. లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కార్యక్ర మాలన్నీ మందకోడిగా సాగుతున్నాయి. దీంతో ఆదా యం లేకపోగా చేతి నుంచి డబ్బులు ఖర్చవుతుండ టంతో వాహనాల యాజమాన్యాలు లబోదిబో ముంటున్నారు.
రాష్ట్రంలో దాదాపు లక్షా 65 వేల సరుకు రవాణా వాహనాలున్నాయి. ఈ వాహనాలన్నీ పన్ను రూపంలో ప్రభుత్వానికి ప్రతి నెల దాదాపు రూ. 100 కోట్ల వరకు చెల్లిస్తున్నాయి. రవాణా రంగంపై రోజురోజుకూ ప్రజల్లో చిన్న చూపు పెరగడం, ఆర్టీఏ, పోలీసుల వేధింపులు కూడా పెరిగిపోతుండటంతో డ్రైవర్‌గా పని చేసేందుకు యువకులు ఏ మాత్రం ఆసక్తిని కనబరచడం లేదు. అసంఘటిత రంగంగా రవాణా రంగం ఉండటం కూడా ఇందుకు కారణం. వాహనాలున్నా డ్రైవర్ల కొరత కార ణంగా దాదాపు 30 శాతం వాహనాలు ఎప్పుడూ ఆగిపో తున్నాయి.
గడచిన ఏడాది కారణంగా కరోనా వైరస్‌ రేకెత్తిస్తున్న భయాందోళనల కారణంగా మరో 30 శాతం మంది డ్రైవర్లు వాహనాలను నడిపేందుకు సిద్దంగా లేకపోవడ ంతో ఆగిపోతున్నాయి. మిగతా 40 శాతం వాహనాలకు కూడా ప్రస్తుతం పని లేకుండా పోయింది. భవన నిర్మాణ సామాగ్రికి అంతగా డిమాండ్‌ లేకపో వడం, సరుకు రవాణాకు ఉన్నా లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు సమయం ఎక్కువగా పట్టడంతో వాహనాల యాజమా న్యాలు ఇక్కట్ల పాలవుతున్నారు.
పరిశ్రమలకు అనుమతులున్నా పని చేసే కార్మికులు లేకపోవడంతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే లాక్‌డౌన్‌ సడలింపులు ఉండటంతో లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు వచ్చే కార్మికులు కూడా అంతంత మాత్రంగానే హాజరవుతున్నారు. దీంతో ఒకసారి సరుకు లోడ్‌ చేసుకుని అన్‌లోడింగ్‌ చేసేందుకు దాదాపు మూడు రోజులు పడుతుందని యజమానులు అంటున్నారు. దీంతో ఆదాయం లేకపోగా ఖర్చులకు సరిపోయే డబ్బులు కూడా రావడం లేదని వాపోతు న్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, కర్నాటక తదితర రాష్ట్రాలకు సరుకులను తీసుకు వెళ్ళే వాహనాలను సరి హద్దులలోనే నిలిపి వేస్తున్న ఆయా రాష్ట్రాల పోలీసులు డ్రైవర్లకు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ సర్టిఫికెట్‌ కోరుతుం డటంతో మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. అసలే డ్రైవర్ల కొరతతో సతమవుతున్న రవాణా రంగానికి కోవిడ్‌ దెబ్బ తీవ్రంగా పడిందని పేర్కొంటున్నారు.
ప్రాధాన్యత రంగంగా గుర్తించి డ్రైవర్లకు టీకా వేయాలి
రవాణా రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం సరుకు రవాణా వాహనాల డ్రైవర్లందరినీ కోవిడ్‌ వారియర్లుగా గుర్తించి టీకాను వేయించాలని లారీ యజమానుల సంఘం కోరుతోంది. డ్రైవర్లకు టీకాను వేయిస్తే చాలా మంది ముందుకు వస్తారని, పొరుగు రాష్ట్రాలలో వాహనాల ప్రవేశాలపై ఆంక్షలున్నా ఇబ్బందులు తలెత్తవని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని తమను ఆదుకోవాలని లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి కోరారు.
ఐకేపీ వేధింపులు ఆపాలి
రాష్ట్రంలో ధాన్యం రవాణాను పోలీసులు, ఆర్టీఏ అధికారులు లారీలను బలవంతంగా తీసుకు వెళ్ళడాన్ని వెంటనే ఆపాలని ఆయన కోరారు. ఒక లారీ ఐకేపీ కేంద్రానికి వెళ్తే లోడింగ్‌, అన్‌లోడింగ్‌ అయ్యే సరికి వారం పడుతుందని, దీంతో డ్రైవర్లు పని చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారని భాస్కర్‌రెడ్డి చెప్పారు. లారీ యజమానులకు కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఐకేపీ ధాన్యం తరలింపు కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్న కొంత మంది అధికారులు తమను ఇబ్బందుల పాలు చేయడం సరైంది కాదంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement