నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పోలీసులు ఇవ్వాల (సోమవారం) ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ నాకాబందీని పులే నగర్ లో ఏఎస్పీ సుభాష్ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో చేపట్టారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు.
శాంతిభద్రతల చర్యల్లో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్లు నిర్వహించినట్లు సీఐ శీను తెలిపారు. ఇందులో భాగంగా ఎలాంటి పేపర్స్ లేని 93 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే కమ్యూనిటీ కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.