.బైంసా టౌన్ సిఐ శ్రీనునిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పిప్రి కాలనీలో జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ సుభాష్ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. వేకువ జము నుండే ఇంటింటికి వెళ్లి వాహనాలను తనిఖీచేశారు. సరైన ధ్రువపత్రాలు లేని, జరిమానా ఉన్న 101 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం సైబర్ నేరాలపై సీఐ శ్రీను స్థానికులకు అవగాహన కల్పించారు. ఎవరైనా సైబర్ క్రైంకి గురైతే వెంటనే 1930 నెంబర్ కి కాల్ చేయాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఇల్లు అద్దెకి ఇవ్వొద్దని ఇచ్చే ముందు అన్ని చూసుకొని ఇవ్వాలని అన్నారు. ఇందులో సీఐ, 6 ఎస్సైలు, 40 మంది సిబ్బంది పాల్గొన్నారు.