నిజామాబాద్ సిటీ, ఆగస్టు 30 (ప్రభ న్యూస్): నేరాలను నియంత్రించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. ఇవాళ తెల్లవారు జామున నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 3టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాముల బస్తీ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిం చారు. నిజామాబాద్ ఏసిపి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ నరహరి నేతృత్వంలో కాలనీలోని అనుమానాస్పద వ్యక్తుల వద్దకు వెళ్లి వారి వివరాలను, గుర్తింపు కార్డులను అడిగి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ తమ కాలనీలో అనుమానాస్పద వ్యక్తులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. కొత్తవారు, గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇండ్లలో అద్దె కోసం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని, వారి వద్ద సరైన గుర్తింపు కార్డులను పరిశీలించే తమ ఇళ్ళను అద్దెకు ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా సరైన ధ్రువపత్రాలు లేని, నెంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలను పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. పలు ఇళ్లలో తనిఖీలు చేపట్టి మారనాయుధాలు ఉన్నాయా అని పరిశీలించారు. సరైన ధృవపత్రాలు నెంబర్ ప్లేట్లు 30 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటో ఆధీనంలోకి తీసుకున్నారు.