Tuesday, November 19, 2024

Copper Dam – మేడిగ‌డ్డ బ్యారేజ్ లో కాప‌ర్ డ్యాం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగడానికి ఉత్పన్నమైన ఆంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చెెసేం దుకు నీటిపారుదల శాఖ నిపుణులు దృష్టి సారించారు. కాపర్‌ డ్యాంనిర్మించి పిల్లర్ల అడుగుభాగం బలహీన పడేందుకు దోహదం చేసిన అంశాలను పరిశీలించి తీసుకునే చర్యలను విశ్లేషిస్తున్నారు. వర్టికల్‌ క్రాక్‌ ఏర్పడడానికి పునాదుల బలహీనత తోపాటు నిర్మాణాలను పరిశీ లించనున్నారు. ఈ మేరకు ఎల్లంపల్లి నుంచి అన్నారం మీదుగా వస్తున్న 30వేల క్యూసెక్కుల నీటిని ఎప్పటికప్పుడు 74 గేట్ల ద్వారా కిందికి తర లిస్తున్నారు. ప్రస్తుతం 7వ బ్లాక్‌ లోని 20 పిల్లర్‌ తోపాటు గా కుంగిన పిల్లర్ల దగ్గర ఉన్న 10 మీటర్ల లోతు నీటిని దిగువకు తరలిస్తున్నారు. అలాగే ప్రాజెక్టు నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ సంస్థకు చెందిన భారీ నిర్మాణ యంత్రాలు సంఘటన స్థలానికి తరలి స్తున్నారు. 1672 మీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టులోని 7వబ్లాక్‌ సంబంధించిన 10 పిల్లర్ల దగ్గరకు వరదనీరు చేరుకోకుండా కాపర్‌ డ్యాంనిర్మాణం చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర డ్యాంసేఫ్టీ అథారిటీ ఒకవైపు నీటిపారుదల శాఖ మరో వైపు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకుంటుండగానే సంబంధిత ఇంజనీరింగ్‌ నిపుణులు పనుల్లో వేగం పెంచి విధులు నిర్వహిస్తున్నారు.

సుమారు 350 మీటర్ల నుంచి 400 మీటర్ల పరిధిలో కాపర్‌ డ్యాం నిర్మించి నీటి ప్రవాహం 7వ బ్లాక్‌ కు చేరుకోకుండా కట్టడి చేసి పిల్లర్ల దగ్గర నిల్వ ఉన్న 10 మీటర్ల లోతు నీటిని పునాదులవరకు దిగువకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెలాఖరులోగా కాపర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేసి పిల్లర్లు కుంగడానికి దోహదపడ్డ అంశాలతో పాటు భారీ శబ్దం రావడానికి కారణాలను ఇంజనీరింగ్‌ నిపుణులు పరిశీలించనున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల అనంతరం అవసరమైతే పిల్లర్లను 100 మీటర్లు ముందుకు జరిపి తిరిగి నిర్మించడమా ఉన్న పిల్లర్లను బలోపేతం చేయడమా అనే అంశానికి స్పష్టత రానుంది. ప్రస్తుతంఎగువనుంచి వస్తున్న నీటిని దిగువకు పంపిస్తున్నారు, ఈ నీటిని సమ్మక్క బ్యారేజీలో నింపి అక్కడి నుంచి చెరువులు కుంటలు, పంటకాలువలకు తరలిస్తున్నారు.

నీరు సంవృద్ధిగా సమ్మక్కసాగర్‌ లో నింపిన అనంతరం అక్కడి నుంచి భద్రాచలం మీదుగా పోలవరం, ధవళెశ్వరం మీదుగా సముద్రంలో కలవనున్నాయి. ఈ ప్రక్రియ కొనసాగి స్తూ కాపర్‌ డ్యాం నిర్మించి ఎన్నిక నియమావళి గడువు అనంత రం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర నీటి పారుదల శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు కదులుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement