Tuesday, November 26, 2024

TS : చ‌ల్ల‌బ‌డ్డ వాతావ‌ర‌ణం… వ‌ర్ష‌సూచ‌న‌

ఎండ‌లు దండికొడుతున్న త‌రుణంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌ సహా తెలంగాణలో వాతావరణం కొంత చల్లబడింది. వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డ‌డంతో ప్ర‌జ‌లు కొంత ఉప‌శ‌మ‌నం పొందుతున్నారు. దీంతో పాటు తెలంగాణ‌కు వ‌ర్ష‌సూచ‌న కూడా ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఇవాళ, రేపు తెలంగాణ‌లో ప‌లుచోట్ల మోస్త‌రు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుండటం వల్ల రాగల 24 గంటల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో మోస్తురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ పేర్కొంది. మరోవైపు.. ఉత్తర తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. కాగా, ఇప్పటికే ఆదిలాబాద్‌, కరీంనగర్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, సిరిసిల్ల, మెదక్‌లలో వర్షం కురిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement