Saturday, November 23, 2024

వంట నూనెలపై వరం

  • బేసిక కస్టమ్స్‌ సుంకం ఎత్తివేత

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌: మహానగరవాసులకు ఊరట కలిగించే శుభవార్తను కేంద్రం ప్రకటించింది. వంట నూనెలపై కస్ట మ్స్‌ సుంకాన్ని ఎత్తి వేస్తున్నట్లు తెలిపింది. ఇటీవల కాలంలో నూనెల ధరలు భారీగా పెరగడంతో పాటు ఇతర నిత్యావసర ధరలు సైతం చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వంట నూనెలపై బేసిక్‌ కస్ట మ్స్‌ సుంకం ఎత్తి వేస్తున్నట్లు, అగ్రిసెస్‌ను కూడా తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీంతో ధరలు దిగిరానున్నాయి. వంట నూనెలపై ఇప్పటి వరకు బేసిక్‌ కస్ట మ్స్‌ సుంకం దాదాపు 32.5 శాతం ఉండగా, ఇప్పుడది 17.5శాతానికి తగ్గింది. అదే విధంగా పామాయిల్‌పై అగ్రిసెస్‌ 7.5శాతానికి తగ్గగా, ముడి సోయాబీన్‌, ముడి పొద్దుతిరుగుడు నూనెలపై అగ్రిసెస్‌ 5.5 శాతానికి తగ్గింది. ఈ ఎత్తివేత ఈ నెల 14 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు కొనసాగనుంది. తదుపరి సమీక్షించి మరోసారి నిర్ణయం ప్రకటించే వరకు వంట నూనెల ధరలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రెండు చర్యలతో దసరా, దీపావళి పండుగ సీజన్లలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కాస్త ఊరట కలిగించినట్లయింది. ఆరు నెలల క్రితం రూ.90 ఉన్న పామాయిల్‌ రూ.150, సన్‌ఫ్ల వర్‌ రిఫైన్డ్‌ ఆయిల్‌ కూడా రూ.110 నుంచి రూ.180 వరకు చేరింది. నగరంలో దాదాపు రూ.200కు అమ్ముతున్నారు. దీంతో వంటి ఇంటి బడ్జెట్‌ తారుమారవుతుండటంతో సామాన్యులతో పాటు మధ్య తరగతి వర్గాలు ఆందోళన వ్యక్తం చేసేవి. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కొంత మేరకైనా ఊరట కలుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement