Tuesday, November 19, 2024

రంజాన్‌ మాసం నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు.. రోజూ సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లిం మైనారిటీ ఉద్యోగ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రంజాన్‌ ఉపవాసాల నేపథ్యంలో ఉద్యోగులు ప్రతి రోజూ సాయంత్రం గంట ముందే విధులు ముగించుకుని వెళ్లేందుకు అనుతించింది. రంజాన్‌ మాసం మొత్తం ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే కార్యాలయాలనుంచి వెళ్లేందుకు అనుమతిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. ఉపవాసాల అనంతరం సాయంత్రం మసీదుల్లో ప్రార్థనలు చేయనున్న నేపథ్యంలో ఈ నెల 3తేదీ నుంచి గంట ముందే వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement