Friday, September 6, 2024

Controversy – ఐఎఎస్ స్మితా స‌బ‌ర్వాల్ పై దివ్యాంగులు గ‌రం గ‌రం

ఆమె చేసిన ట్విట్ పై దివ్యాంగులు ఫైర్
త‌క్ష‌ణం ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌ర‌బాద్ – దివ్యాంగుల‌కు సివిల్స్ రిజ‌ర్వేష‌న్ అవ‌స‌ర‌మా అంటూ ఐఎఎస్ అధికారిణి స్మితా స‌బ‌ర్వాల్ చేసిన ట్విట్ ఇప్పుడు వివ‌దాస్ప‌ద‌మైంది.. వివ‌రాల‌లోకి వెళితే ఇటీవల ఐఏఎస్‌ ట్రైనీ అధికారి పూజా ఖేద్కర్ ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆమె తనకు వైకల్యం ఉన్నట్లు కూడా తప్పుడు సర్టిఫికేట్ సమర్పించారు. ఇప్పటికే యూపీఎస్సీ పూజా అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతోపాటు భవిష్యత్తులో మళ్లీ ఆమె పరీక్షలకు హాజరు కాకుండా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై చర్చ జరుగుతున్న వేళ ఐఏఎస్‌ స్మితా సబర్వాల్ దీనిపై ఎక్స్‌ వేదికగా స్పందించారు.

‘ ఒక ఎయిర్ లైన్‌.. వైకల్యం ఉన్నవారని పైలట్‌గా తీసుకుంటందా ?, వైకల్యం ఉన్న ఒక సర్జియన్‌ను మీరు నమ్ముతారా ?. ఐఏఎస్‌/ఐపీఎస్/ఐఎఫ్‌ఓఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది. ప్రజల సమస్యలను వినాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫిజికల్ ఫిట్‌నెస్ అవసరమవుతుంది. ఇలాంటి ప్రీమియర్‌ సర్వీస్‌కి దివ్యాంగ కోటా ఎందుకు అవసరం’ అంటూ త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు..

- Advertisement -

దివ్యాంగుల‌ను కిచ‌ప‌ర‌చ‌డ‌మే … బాల‌ల‌త

దీంతో స్మిత సబర్వాల్‌ వ్యాఖ్యలను మాజీ బ్యూరోక్రాట్ బాలలత తీవ్రంగా ఖండించారు. దివ్యాంగులను కించపరిచేలా మట్లాడారంటూ మండిపడ్డారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన స్మీతా సబర్వాల్ ఇలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ‘ఆమె ట్వీట్ దివ్యంగుల పట్ల వివక్షతను చూపుతోంది. ఐటీ యాక్ట్ కింద స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి. స్మితపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి. లేదంటే ట్యాంక్ బండ్‌పై ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. స్మిత చేసిన వ్యాఖ్యలపై సాటి ఐఏఎస్‌లు స్పందించాలి. ఆమెకు ఏదైనా జరగరానిది జరిగి దివ్యంగురాలు అయితే ఐఏఎస్ కి రాజీనామా చేస్తారా ?. ఆమె రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతోంది’ . స్టీఫిన్ హాకింగ్, సుదా చంద్రన్ వంటి మేధావులు అంగవైకల్యం జయించారు.. అంగవైకల్యం ఉన్న జై పాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటరీ సాధించారు..అంగవైకల్యంతో పద్మశ్రీ, పద్మ భూషన్ అవార్డులు తీసుకున్నవారువున్నారు అంటూ బాలలతా అన్నారు. మరోవైపు స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ అమె వ్య‌క్తిగ‌త‌మా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.. దీనిపై స్మిత సంజాయిషీ ఇవ్వాల్సిదేనంటున్నారు కొంద‌రు.

Advertisement

తాజా వార్తలు

Advertisement