Tuesday, November 26, 2024

MLC Kavitha : భారీ వర్షాలు.. అందుబాటులో కంట్రోల్ రూం..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉందని కవిత తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూం ద్వారా అధికారులను సంప్రదించగలరని కోరారు. తాను కూడా కార్యాలయంలో నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రజలకు సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ భరోసా నింపుతూ ఉన్నారని తెలిపారు. ప్రజలకు కనీస అవసరాలకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రిలీఫ్‌ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement