Sunday, November 17, 2024

మా జీతాల సంగతేంటి? ప్రభుత్వాస్పత్రి కార్మికుల ప్రశ్న

ప్రభుత్వ ఆస్పత్రుల్లోని శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల ఆందోళనలు నాలుగో రోజుకు చేరింది. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాలుగవ రోజు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అన్ని విభాగాల కార్మికులకు  జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు మాత్రం  ఏ మాత్రం జీతాలు పెంచకపోవడం అన్యాయమని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్  రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నర్సింహ విమర్శించారు.

గత సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తమ జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు దాట వేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రూ.9400 జీతంతో కార్మికులు తమ కుటుంబాలన్ని ఎలా పోషించగలరని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు రూపాయాలు  17500/- ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…  ప్రభుత్వ ఆస్పత్రుల  శానిటేషన్ సిబ్బందిని మాత్రం  పట్టించుకోకపోవటం  అన్యాయం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement