హైెదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ హాస్టల్స్‌లోని విద్యార్థులకు కలుషిత ఆహారం, కలుషిత నీళ్లు ఇవ్వడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి తెలిపారు. ప్రభుత్వ హాస్టల్స్‌కు సరిపడా నిధులు విడుదల చేయకపోవడంతోనే నాణ్యమైన ఆహారం అందడం లేదని, కలుషిత ఆహారానికి కారణమని ఆమె విమర్శించారు. బుధవారం ఆమె గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు అనిల్ యాదవ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తండ్రి స్థానంలో ఉన్న సీఎం కేసీఆర్.. ఒక్కసారైనా హాస్టల్స్‌ను విజిట్ చేస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆమె పేర్కొన్నారు.
సిద్దిపేట గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురైనా మంత్రి హరీష్‌రావు అక్కడికి వెళ్లలేదని పేర్కొన్నారు. సిద్దిపేట గురుకుల పాఠశాల మెస్ కాంట్రాక్టర్ మంత్రి బంధువుదని ఆమె ఆరోపించారు. పిల్లల భవిష్యత్ కోసం విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు కొట్లాడుతుంటే.. ఆ అంశం సిల్లిdదని మంత్రులు మాట్లాడటం శోచనీయమని గీతారెడ్డి అన్నారు. పిల్లలు దేశ సంపదని, వారిని పట్టించుకోకపోతే ఎలా..? అని ఆమె నిలదీశారు. విద్యార్థినుల వ్యక్తిగత అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని విమర్శించారు. బాసర ఐఐఐటీలో మెస్ అంశం పెద్ద కుంభకోణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ విద్యా సంస్థల్లో వరసగా పుడ్ పాయిజన్ అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.