Sunday, November 24, 2024

TS | గృహలక్ష్మీ పథకంతో పెరిగిన గ్యాస్‌ వినియోగం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకం కింద అమలు చేస్తున్న 500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకంతో మూడు నెలల్లోనే సిలిండర్ల వినియోగం పెరిగిందని పౌరసరఫరాలశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పథకం అమలు తేదీ నుండి ఇప్పటి వరకు 39, 33, 615 మంది అర్హత పొందారు.

ఇప్పటి వరకు 18, 86, 045 సిలిండర్లు రీఫిల్‌ కోసం బుక్‌ అయ్యాయి. ఇప్పటి వరకు 21, 29, 460 సిలిండర్లను లబ్దిదారులు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ కోసం రూ. 59.97కోట్ల సబ్సీడీని క్లెయిమ్‌ చేసింది. కాగా… తెలంగాణ వ్యాప్తంగా 1.20కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89,99లక్షలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement