తమ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం వినియోగదారుల రుణాల ధోరణి సానుకూలంగా ఉందని హోమ్ క్రెడిట్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వివేక్ కుమార్ సిన్హా అన్నారు. యూరోప్, ఆసియా వ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో పాటుగా భారతదేశంలో ఆర్ధిక చేర్పుకు తోడ్పాటునందిస్తున్న అంతర్జాతీయ వినియోగదారు రుణ ప్రదాతకు స్థానిక విభాగం హోమ్‌క్రెడిట్ తమ వార్షిక అధ్యయనం ‘హౌ ఇండియా బారోస్ (హెచ్‌ఐబీ) (ఇండియా ఏ విధంగా రుణాలను తీసుకుంటుంది)ను ఈరోజు విడుదల చేసింది.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికశాతం మంది వినియోగదారులు తమ భావి అవసరాల కోసం ఆన్‌లైన్‌లో రుణాలను తీసుకోవాలని కోరుకుంటున్నారన్నారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ద్వారా ప్రజల జీవితాలలో సానుకూలతను తీసుకురావడాన్ని హోమ్ క్రెడిట్ విశ్వసిస్తుందన్నారు. మారుతున్న రుణగ్రహీతల ప్రవర్తనను అర్థం చేసుకునేందుకు హెచ్‌ఐబీ అధ్యయనం తమకు తోడ్పడుతుందన్నారు. తద్వారా వినియోగదారులకు సరైన రీతిలో మద్దతునందించడం వీలవుతుందన్నారు. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, హైదరాబాద్, బెంగళూరులు వేగంగా కోలుకున్నాయని, హైదరాబాద్‌లో 41శాతం మంది వ్యాపార పునరుద్ధరణ కోసం రుణాలు తీసుకున్నారని తెలిపారు.