ఎంఎంటీఎస్ ఫేజ్-2 ట్రాక్ పనులు, సీతాఫల్మండి-, లాలాగూడ, -మెట్టుగూడ, ఆలుగడ్డ బావి రూట్లో జరుగుతున్న ఆర్ యూబీ నిర్మాణ పనుల కారణంగా ఈ నెల10 నుంచి మే 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిటీ సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.తార్నాక -మెట్టుగూడ, మల్కాజిగిరి – -మెట్టుగూడ మార్గాల్లో డెవర్షన్స్ఉంటాయని స్పష్టం చేశారు.
తార్నాక, లాలాపేట నుంచి సంగీత్క్రాస్రోడ్డు వైపు వెళ్లే వాహనదారులు తార్నాక- సీతాఫల్మండి ఫ్లైఓవర్ నుంచి చిలకలగూడ ఎక్స్‌రోడ్డు మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే మల్కాజిగిరి, మీర్చాలగూడ, లాలాగూడ నుంచి సికింద్రాబాద్వచ్చే వాహనాలను తుకారాంగేట్ఆర్యూబీ, తుకారాంగేట్, వెస్ట్‌మారేడుపల్లి సెయింట్జాన్స్రోటరీ మీదుగా సంగీత్ క్రాస్‌రోడ్స్, చిలకలగూడ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్‌వైపు మళ్లిస్తున్నట్లు చెప్పారు. నెల రోజుల పాటు డైవర్షన్స్ కొనసాగుతాయని, వాహనదారులు సహకరించాలని కోరారు.