జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాధం నెలకొంది. కూబింగ్ చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందాడు. కానిస్టేబుల్ మృతి పై సీఎం రేవంత్రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
జంతువులను వేటాడేందుకు దుండగులు ఇనుపకంచెలను ఏర్పాటు చేశారు. ఇనుపకంచకు కరెంట్ పెట్టారు దుండగులు. ఇది గమనించని కానిస్టేబుల్ కూబింగ్ చేస్తున్న సమయంలో ఆ తీగులను ముట్టుకున్నాడు. ఈ తరుణంలోనే..కరెంట్ షాక్ తో కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందాడు. ఈ ఘటన పై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. కానిస్టేబుల్ మృతికి కారణమైన దుండుగలను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.