Monday, November 25, 2024

TS: సర్వీస్‌ గన్‌ తో కాల్చుకునికానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్ లో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్ ఖానా, పోలీసు పికెట్ వద్ద టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.10వ బెటాలియన్‌‌లో పనిచేసే పాలేశ్వర్‌ సర్వీస్‌ గన్‌ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడ్డాడు.

సమాచారం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement