అద్డె కూడా చెల్లించలేని దీనస్థితిలో ప్రభుత్వం
ఢిల్లీకి మూటల పంపేందుకు డబ్బులుంటాయ్
కానీ భవన అద్డెలు మాత్రం చెల్లించరు
రేవంత్ పై విరుచుకుపడ్డ కేటీఆర్
దిగజారుతున్న విద్యావ్యవస్థకు ఇది పరాకాష్ట
కాంగ్రెస్ పై హారీశ్ రావు గరం గరం
హైదరాబాద్ – తెలంగాణలో గురుకులాలు మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీకి మూటలు పంపేందుకు, కమీషన్లు వచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు వేల కోట్లు ఉన్నాయి కానీ.. పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల అద్దెలు చెల్లించడానికి పైసలు లేవా ? అని ప్రశ్నించారు కేటీఆర్. సిగ్గు, సిగ్గు.. ఇది గురుకులాలు శాశ్వతంగా మూసివేసే కుట్ర లాగా కనబడుతుందని కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
దిగజారుతున్న విద్యావ్యవస్థకు ఇది పరాకాష్ట…
గురుకులాలకు అద్దెలు ఇంకెప్పుడు చెల్లిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రోజురోజుకి దిగజారిపోతున్న విద్యావ్యవస్థ గురించి విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న మీరు ఇంకెప్పుడు పట్టించుకుంటారని నిలదీశారు. గత 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యజమాని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌కు తాళం వేశారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అద్వాన్న స్థితికి చేరుకుందనడానికి ఇది మరొక నిదర్శనమంటూ ఫైర్ అయ్యారు. ఇలా మూతపడటం దిగజారుతున్న విద్యావ్యవస్థకు పరాకాష్ట అంటూ వ్యాఖ్యానించారు హరీశ్ రావు..