గోల్డ్‌డ్రాప్‌లో స్థిరమైన నాణ్యత ఉంటుందని మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ మితేష్ లోహియా అన్నారు. మహమ్మారి ఆరంభమైన అనంతరం చాలామంది వీలైనంతగా ఇళ్లలోనే వండుకున్న ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనితో పాటుగా చేసే వంటకాలలో ప్రయోగాలు కూడా గణనీయంగా పెరిగాయి. మనం మరిచిపోయిన సంప్రదాయ వంటకాలు మొదలు అమ్మమ్మల కాలం నాటి వంటకాల రహస్యాలతో పాటుగా నేటి కాలపు క్విక్ రెసిపీల వరకూ గత రెండేళ్ల కాలంలో ఎనెన్నో ఆవిష్కరణలను గృహిణిలు చేశారు. రోగ నిరోధక శక్తి మెరుగుపరిచే పదార్థాలను వంటకాలలో వాడటం పెరిగింది.
వారాంతంలో కుటుంబమంతా కలిసి భోజనం చేయడాన్ని ఓ అలవాటుగానూ మార్చుకున్నారు. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ పోషకాలను అందించే వంటకాలు మాత్రమే కాదు వైవిధ్యమైన రుచులతో కూడిన వంటకాలూ కనిపిస్తున్నాయి. ఈసందర్భంగా మితేష్ లోహియా మాట్లాడుతూ… అత్యుత్తమ ముడిపదార్ధాలను గోల్డ్ డ్రాప్ వినియోగిస్తుందన్నారు. అల్ట్రా మోడ్రన్ రిఫైనింగ్ సదుపాయాలతో పాటుగా ఖచ్చితమైన నాణ్యత పరీక్షలను సంస్థ కలిగి ఉందన్నారు. గోల్డ్‌డ్రాప్‌లో స్థిరమైన నాణ్యత, స్వచ్ఛత ప్రతి చుక్కలోనూ కనిపించడం వల్ల వినియోగదారులు దీనిని అభిమానిస్తున్నారని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..