Friday, November 22, 2024

TS : రేపు మేనిఫెస్టోను రిలీజ్ చేయ‌నున్న కాంగ్రెస్

బ‌య్యారం ఉక్కు ఫ్యాక్ట‌రీ
ప్రాణ‌హిత – చేవేళ్ల ప్రాజెక్ట్ కు జాతీయ హోదా
విభ‌జ‌న హామీలు అమ‌లు

హైద‌రాబాద్ – లోక్ స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనుంది. రేపు ఉదయం 11 గంటలకు ‘తెలంగాణ మేనిఫెస్టో’ను సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ లోని గాంధీ భ‌వ‌న్ లో విడుదల చేయనున్నారు.
కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో రేవంత్ రెడ్డి వివరించనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు క‌ల్పించిన‌ట్లు స‌మాచారం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వ‌స్తే బ‌య్యారం ఉక్కు ఫ్యాక్ట‌రీ, ప్రాణ‌హిత – చేవేళ్ల ప్రాజెక్ట్ కు జాతీయ హోదా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ అంశాల‌ను చేర్చ‌నుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల మంత్రం పనిచేయడంతో ఈ సారి లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించే హామీలపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో తీవ్క ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

శుక్ర‌వారం ఉద‌యం రేవంత్‌రెడ్డి మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌నున్నారు. కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్ప‌నున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంట్ పోరులోనూ రిపీట్ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌వేశ‌పెట్టిన మేనిఫెస్టోతో పాటు మ‌రికొన్ని హామీల‌ను క‌లిపి మేనిఫెస్టోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు సీఎ రేవంత్‌. అందులో భాగంగా విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement