Friday, November 22, 2024

TS : వంద‌ రోజుల్లో అట్టర్ ప్లాప్… ఎంపీ అభ్య‌ర్థి వినోద్‌..

కరీంనగర్, ప్ర‌భ‌న్యూస్ః దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోనే అట్టర్ ప్లాప్ అయిందని కరీంనగర్ బారాస అభ్యర్థి బోయిన్ ప‌ల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ లోని కిసాన్ నగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీన రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా రైతులను మోసగిస్తూనే ఉన్నారన్నారు. బ్యాంకులు రైతులను రుణాలు కట్టాలని ఇబ్బందుల పాలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. రైతులకు పంట పెట్టుబడి కింద అందించే రైతు బంధు కూడా జమ చేయలేదని, కౌలు రైతులకు సహాయం ఊసే లేదన్నారు.

- Advertisement -

4వేల పింఛన్ అందిస్తామని మాట తప్పని, గ్యారంటీల పేరుతో ప్రజలను మోసగించారన్నారు. రైతులకు సాగునీరు అందించకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీకి చుక్కలు చూపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. బిజెపి మతతత్వ పార్టీ అని, ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ గత ఐదేళ్లలో కరీంనగర్ ఏం చేశారన్నారు. నగర అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని, స్మార్ట్ సిటీ పేరుతో నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపిలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగర మేయర్ సునీల్ రావు స్థానిక కార్పొరేటర్లు ఎడ్ల సరిత – అశోక్,కంసాల శ్రీనివాస్, కుర్ర తిరుపతి నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ పలువురు డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement