Wednesday, November 20, 2024

Congress Trouble – ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌కు పొంగులేటి త‌ల‌నొప్పి …

సూర్యాపేట, ప్రభన్యూస్‌ ప్రతినిధి:

గత కొన్ని నెలల క్రితం బీఆర్‌ఎస్‌ అంసతృప్త నేతలుగా ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావులను వివిధ రాజకీయ పార్టీలు ఆ ఇరువురు అభ్యర్థు లను తమ పార్టీలోకి చేర్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశాయి. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనతో పాటు రానున్న ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీలో చేరేందుకు చాలా రోజులు మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. కర్నాటక ఎన్నికల ఫలితాలతో సస్పెన్షన్‌కు తెరదించుతూ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతామని ప్రకటించి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇంత వరకు అంతా సజావుగానే ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను క్లీన్‌ స్వీప్‌ చేస్తానని వాగ్ధానం చేశారు. జిల్లా నేతగా ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి సమీపంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు శాసన సభ స్థానాల్లోని అధికార పార్టీ అసమ్మతి నేతలను, ఇతర పార్టీ నేతలను మచ్చిక చేసుకొని తన ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేర్పించి తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం ముమ్మరం చేశారని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరగుతుంది.

రాహుల్‌ సభలో సూర్యాపేట నేతలు..
ఇటీవల ఖమ్మంలో జరిగిన రాహుల్‌ గాంధీ సభలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ ఎస్‌ అసమ్మతి నేతలను కొందరిని తన ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేర్పించి తన ఉనికిని సూర్యా పేటలో చాటారు. కోదాడ, హుజూర్‌ నగర్‌, నకిరేకల్‌తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరికొన్ని నియోజకవర్గాలలో అసమ్మతి నేతలతో మంతనాలు చేస్తున్నట్లు వినికిడి.

సీనియర్‌ నేతల ఆగ్రహం..
ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన శ్రీనివాస్‌ రెడ్డి పక్క జిల్లాలో కూడా వేలుపెడుతుండడంపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌లో రాష్ట్ర రాజకీయాల్లో జాతీ య నాయకులు, జిల్లా రాజకీయాల్లో రాష్ట్ర నాయకులు జోక్యం చేసుకోవడం అరుదు. మాజీ మంత్రులు లేదా స్థానిక శాసన సభ అభ్యర్థులు మాత్రమే వారి నియోజకవర్గాల్లో రాజకీయ కార్యక్రమాలను కొనసాగి స్తారు. అటువంటి పరిస్థితుల్లో ఏకంగా పక్క జిల్లాలోకి వచ్చి వివిధ నియో జకవర్గాల్లో అధికార పార్టీ అసమ్మతి నాయకులను పార్టీలో చేర్పించేందుకు ఉత్సాహం చూపించడం, దీనికి రాష్ట్రంలో, జిల్లాలో సీనియర్‌ నాయకులకు ఎటివంటి సమాచారం లేకుండా వారి వారి నియోజకవర్గాల్లో తలదూర్చడం కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వర్గ విభేదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి శ్రీనివాస్‌ రెడ్డి రూపంలో మరో సమస్య ఎదురవుతుండడంతో స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లా అగ్ర నాయకులలో ఒకరు శ్రీనివాస్‌ రెడ్డికి ఇప్పటికే చురకలంటించినట్లు పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. తన రాజకీయాలు ఖమ్మంజిల్లాలో చేసుకొని పార్టీ విజయానికి కృషి చేస్తే సంతోషిస్తామని అంతే కానీ పక్క జిల్లాలోని నియోజకవర్గాల్లో ఉనికి కోసం తమను ఇబ్బంది పెట్టడం స రైంది కాదని హెచ్చరించినట్లు కాంగ్రెస్‌ నేతలు బహాటంగా చెబుతున్నారు. సాధారణంగా కాంగ్రెస్‌ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరడం షరా మామూలే. అగ్రనేతలు కలుగజేసుకొని సమన్వయం చేసుకొని ముందుకు సాగుతుండడం సాధారణ అంశం. ఇప్పటికే అధికారానికి దూరమై ఇబ్బందులు పడుతున్న క్యాడర్‌ను కాపాడుకునేం దుకు నేతలు ఒకొక్కరుగా సమైఖ్యత రాగం అందుకున్నారు. ఈ క్రమంలో పొంగులేటి రూపంలో జిల్లాకు కొత్త తలనొప్పి రావడంతో కార్యకర్తలు సైతం ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement