Friday, November 22, 2024

వ‌డ్ల‌ కొనుగోలు కేంద్రాల వ‌ద్ద రైతుల క‌ష్టాలు.. పరిశీలించింది కాంగ్రెస్‌ బృందం..

కామారెడ్డి, (ప్రభ న్యూస్‌): కామారెడ్డి జిల్లాలోని వరి కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్‌ పార్టీ బృందం పరిశీలించింది. మాజీ శాసనసభ్యులు కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులు కిషన్‌ రెడ్డి నేతృత్వంలో కామారెడ్డి రాజంపేట జంగంపల్లి తదితర ప్రాంతాల్లో వరి కొనుగోలు కేంద్రాల్లో పర్యటించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకొ చ్చి పదిహేను రోజులు అవుతున్నా కాంట వేయడం లేదని కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు సరైన ఏర్పాట్ల చేయ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వడ్ల తూకంలో ఒక బస్తకు ఐదు కిలోల తరుగు తీస్తున్నారని రైతులు కాంగ్రెస్‌ నాయకుల బృందానికి తెలిపారు. తూకం విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. ధాన్యం నిల్వ చేయడానికి గోదాంల ,స్థలాల కొరత ఉందని కేంద్రాల నిర్వాహకులు, సొసైటీ అధికారులు, రైసు మిల్లర్లు చెబుతున్నారని రైతులు కాంగ్రెస్‌ బృందానికి తెలిపారు. పదిహేను రోజులు అవుతున్నా వారు చెప్పిన తేమ రావడంలేదని ,కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నామని రైతులు కాంగ్రెస్‌ నేతల బృందానికి వివరించారు. కాంగ్రెస్‌ నేతల బృందంలో కాంగ్రెస్‌ నేతలు అన్వేష్‌ రెడ్డి కైలాస్‌ శ్రీనివాసరావు ప్రీతం తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement