Tuesday, November 26, 2024

Congress Shock – రెండోసారి రమేష్ రెడ్డికి మొండి చేయి.. బోరున విలపించిన ప‌టేల్ దంపతులు

సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్‌రెడ్డి కన్నీరు పెట్టుకొన్నారు. కాగా, ఈ సీటు విష‌యంలో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సభ్యలు పటేల్ రమేష్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డిని పిలిచి మాట్లాడారు.
టికెట్టు ఎవరికి వచ్చినా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. సర్వే ఆధారంగా టికెట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకొంటామని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు. దీంతో సూర్యాపేట కాంగ్రెస్ టికెట్టు కోసం పటేల్ రమేష్ రెడ్డి ఆశలు పెట్టుకొన్నారు.కానీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్టును కేటాయించింది.

దీంతో కాంగ్రెస్ టికెట్టుపై ఆశలు పెట్టుకొన్న పటేల్ రమేష్ రెడ్డికి టికెట్టు దక్కకపోవడంతో భార్య, కూతురును పట్టుకొని కన్నీళ్లు పెట్టుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తీవ్రస్థాయిలో పటేల్ రమేష్ రెడ్డి అనుచరులు ధ్వజమెత్తారు పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అంటూ ఆమె ప‌టేల్ స‌తీమ‌ణి ఆగ్రహం వ్యక్తం చేసింది. పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ రాలేదన్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు, ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు రమేష్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో ఇంటి దగ్గరికి భారీగా చేరుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని పటేల్ రమేష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనకు టికెట్ రాకుండా కుట్ర జరిగిందని.. ఇదంతా మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించేందుకే చేశారని పటేల్ రమేష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. . 2019లో సైతం ర‌మేష్ రెడ్డికి కాంగ్రెస్ మొండి చేయి చూపింది.. ఇప్పుడ కూడా సీటు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు..

2014 ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి పటేల్ రమేష్ రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి జగదీష్ రెడ్డి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్ధి సంకినేని వెంకటేశ్వరరావుపై జగదీష్ రెడ్డి విజయం సాధించారు.
2019 ఎన్నిక‌ల‌లో టీడీపీని వీడిన రేవంత్ రెడ్డితో పాటు పటేల్ రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే పటేల్ రమేష్ రెడ్డి భార్య గతంలో సూర్యాపేట జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. రమేష్ రెడ్డి స్వగ్రామం బాలెంల గ్రామం. రమేష్ రెడ్డి తండ్రి తెలంగాణ సాయుధపోరాట యోధుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement