Friday, November 22, 2024

TS : కాంగ్రెస్ సర్కార్ మనుగడ కష్టం… మాజీ సీఎం కేసీఆర్

ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ప్రభ న్యూస్ : తెలంగాణ రాక ముందు అంద్రోళ్ళు ఉద్యమాన్ని కింద మీద చేశారు. అనాడు వాళ్ళు అడిగితే ఒకటే మాట చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్రంతో తిరిగి వస్తా అని చెప్పినా… అన్నట్లే ప్రత్యేక తెలంగాణతో వచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడి కొట్లాడి తెచ్చిన అని బీఆర్ఎస్ ఛీఫ్‌ కేసీఆర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌసిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెద ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చినంమన్నారు. ప్రపంచం లో రైతు బంధు అనే పథకాన్ని తెలంగాణ లో ప్రవేశపెట్టనం..మళ్ళీ అధికారం లో కి వస్తె రైతు బంధు మరో వెయ్యి పెంచుదాం అనుకున్నాన్నారు. దళిత బంధు పధకం తో తెలంగాణ లో నే హుజూరాబాద్ లో దళితులు సంపన్నులు అయిర్రు..అన్నారు. హుజూరాబాద్ నియోజక వర్గానికి దోకా లేదు ఇది టెంపరరీ సెట్ బ్యాక్..అని కొనియాడారు. బి అర్ ఎస్ హయం లో పి ఎం నరేంద్ర మోడీ కూడా అసూయ పడే పెట్టుబడులు వచ్చినాయి. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా మిగిలి ఉందన్నారు. నాలుగైదు నెలల్లో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం కోసవెల్లె పరిస్థితి లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది బి అర్ ఎస్ ప్రభుత్వమే..అన్నారు.

ఇంత తొందర వ్యవస్థ ట్రాక్ ఎందుకు తప్పింది ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల ఫలితమే..అన్నారు. గోదావరి నీళ్లు కర్నాటక ఇస్తా అన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి సప్పుడు చేయడం లేదన్నారు. తెలంగాణ లో మన ప్రభుత్వం లేనందుకు కేంద్రం లో మన ఎం పి లను గెలిపించాలని కోరారు. గతం లో ఉన్న కరీంనగర్ ఎం పి తమలపాకు నమలడం తిట్ల పురాణం తప్పితే చేసిందేమీ లేదన్నారు. బస్సు యాత్రకు వచ్చిన ఆదరణ చూసి 48 గంటలు నా ప్రచారం అపిర్రు..నేనేం తప్పు చేసినా అని నా గొంతు నొక్కారని ప్రశ్నించారు. ఎం పి ఎన్నికల తరువాత హుజూరాబాద్ నియోజక వర్గానికి వచ్చి అందరితో కలిసి పండుగ చేసుకుందాం రానున్న రోజుల్లో అధికారం మనదే నన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జెడ్పిచైర్మన్ కనుమల విజయ, ఎంపిపి ముసి పట్ల రేణుక, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ,మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement