హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణాలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న పట్టు-దలతో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాలుకు బలపం కట్టు-కుని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్ని కల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలన్నీ తన భుజస్కంధాలపై వేసుకున్న రేవంత్.. ఓ వైపు తాను బరిలోకి దిగిన కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూనే అక్క డున్న నేతలతో సమన్వయం చేసుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు రోజుకు మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహిస్తు న్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, జగ్గారెడ్డి తదితర కీలక నేతలు తాము పోటీకి దిగిన నియోజకవర్గాలకే పరిమితమై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు వాయు మార్గాన హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తున్న రేవంత్ ఎంపిక చేసుకున్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లి అక్కడ ఏర్పాటు- చేసిన విజయభేరి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటున్నారు.
తిరిగి జంటనగరాల్లో రెండు మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలలో, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొంటు-న్నారు. సగటు-న రోజూ ఐదారు నియోజకవర్గాల్లో తన ప్రచారం నిర్వహిస్తూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే 35 నియోకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న రేవంత్ వచ్చే 15 రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు రూపొందించారు. కాంగ్రెస్ పార్టీ కాస్త బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసి చివరి పది రోజుల్లో ఖచ్చితంగా విజయం తథ్యమన్న సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటించేలా పర్యటనా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు- చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ తర్వాత బీఆర్‌ఎస్ పంచన చేరిన 12 నియోజకవర్గాల్లోని 11 స్థానాల్లో రెండేసి దఫాలు ప్రచారం జరిపేలా భావిస్తున్నట్టు- సమాచారం. ఇప్పటికే కొల్లాపూర్, తాండూరు, భూపాలపల్లి తదితర నియోజకవర్గాల్లో పర్యటించి వచ్చిన రేవంత్ మరో దఫా ప్రచారం నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీ- చేస్తున్న మహేశ్వరం, సుధీర్‌రెడ్డి పోటీ-కి దిగిన ఎల్బీ నగర్, నకిరేకల్ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున రోడ్ షోలు కార్నర్ మీటింగులతో పాటు- బహిరంగ సభల ఏర్పాటు-కు స్థానిక కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు- చేసే పనిలో నిమగ్నమయ్యారు. మంత్రులు పోటీ- చేస్తున్న నియోజకవర్గాలపై కూడా రేవంత్ ప్రత్యేక దృష్టి సారించినట్టు- సమాచారం. ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ- చేస్తున్న సనత్ నగర్, నిరంజన్ రెడ్డి పోటీ- చేస్తున్న వనపర్తి, ఎర్రబెల్లి దయాకర్ రావు బరిలో ఉన్న పాలకుర్తి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార బహిరంగసభల్లో పాల్గొన్న రేవంత్.. ఖమ్మం, సిరిసిల్ల, మహబూబ్ నగర్, బాల్కొండ, నిర్మల్, సిద్ధిపేటలలో వచ్చే నాలుగైదు రోజుల్లో ప్రచారం జరిపేలా వ్యూహం రచిస్తున్నట్టు- ప్రచారం జరుగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో భారీ రోడ్ షోలు, కార్నర్ మీటింగులను ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించాలని ప్రతిపాదించారు.
ఉదయం జిల్లాల్లో జరిగే బహిరంగ సభలకు హాజరై ఐదు గంటలకల్లా నగరానికి చేరుకుని రోడ్ షోలు, కార్నర్ మీటింగులకు హాజరయ్యేలా రేవంత్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు- ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రోజుకు ఆరు నియోజకవర్గాలను తాకేలా ప్రచారానికి శ్రీకారం చుట్టాలని రేవంత్ నిర్ణయించుకున్నారని సమాచారం. పార్టీ అగ్రనేత రాహుల్, ప్రియాంక గాంధీలు ఐదు రోజుల పాటు- తెలంగాణాలో ఉంటు-న్నందున వారితో హైదరాబాద్‌లో అత్యంత భారీ రోడ్ షోలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు- చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి షో ప్రారంభించి శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సనత్‌నగర్, ఖైరతాబాద్, నాంపల్లి, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గం వరకు ఒక రోజు రాహుల్‌గాంధీని రోడ్ షోలో పాల్గొనేలా వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు- సమాచారం. రెండో రోజున మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, సికింద్రాబాద్, అంబర్‌పేట, ముషీరాబాద్, మలక్‌పేట, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం వరకు ప్రచారం జరిపేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు- చెబుతున్నారు.