Friday, November 22, 2024

Congress | తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం.. గాంధీ భవన్ కు పొన్నం అనుచరులు

అతడు విద్యార్థి దశ నుంచి చురుకుగా ఉన్న నేత.. అనంతర పరిణామాల్లో రాష్ట్ర స్థాయి నాయకునిగా ఎదిగాడు. అతనే కరీంనగర్ కు చెందిన పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీల ఫోరం అధ్యక్షునిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో తనదైన బానిను వినిపించారు. తాజాగా ఆయన నారాజ్ అయ్యారు. నిరాశకు లోన‌వుతున్నారు. ఎందుకు? కాంగ్రెస్ లో త‌న‌ను ఉంచుతారా? పొగ పెట్టి సాగనంపుతారా? ఏదో కుట్ర జరుగుతుంది.. అనే చర్చ జోరుగా సాగుతుంది.

కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కరీంనగర్ లోక్‌స‌భ‌ నియోజకవర్గ పరిధి నుంచి వాహనాలు తీసుకొని హైదరాబాద్ తరలి వెళ్తున్నారు. దీనికి ప్రధాన కారణం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికు స్థానం దక్కింది. అయితే పొన్నంకి ఎందుకు దక్కలేదు? అనే చర్చ రెండు రోజుల నుంచి కార్యకర్తల్లో జోరుగా సాగుతుంది.

తాజాగా నియోజకవర్గంలోని కార్యకర్తలు నేతలు హైదరాబాదులోని గాంధీభవన్ కి తరలి వెళ్లారు.
టి పి సి సి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేని కలవ‌నున్న‌ట్టు తెలుస్తోంది. పొన్నం ప్రభాకర్‌కు స్థానం ఇవ్వాల్సిందేనని, లేదంటే లెక్క వేరేలా ఉంటుందని ధర్నా చేయ‌డానికి రెడీ అయ్యారు. మరి అభిమానుల మాటను అధిష్టానం ఖాత‌రు చేస్తుందా? పొన్నం పట్ల కుట్ర జరిగిందా? అన్న‌ది ఏంటో త్వ‌ర‌లో తెల‌య‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement