Friday, September 20, 2024

TG | కాంగ్రెస్ ది దైవర్షన్ పాలిటిక్స్ : హారీష్ రావు

కేసీఆర్ రైతుల కోసం పనిచేస్తుంటే, రేవంత్ సర్కార్ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. దుబ్బాక, నర్సాపూర్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు పి.వెంకటరామారెడ్డి, దేశపతి శ్రీనివాస్, డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, మాజీ ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో క‌లిసి మల్లన్న సాగర్ లో గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈసందర్బంగా హారీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయిందని, 93 వేల కోట్లతో పనులు జరిగితే లక్ష కోట్ల అవినీతి అని దుష్ప్రచారం చేశారని విమర్శించారు. కాళేశ్వరం లో అవినీతి జరిగితే ఎల్లంపల్లి నుండి లక్ష్మి బ్యారేజ్, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు నేడు నీళ్లు ఎలా వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

నేడు అన్ని ప్రాజెక్ట్ లలో నీళ్లు నిండు కుండలా ఉన్నాయంటే అది ప్రాజెక్ట్ ఫలితమేనన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల నిర్మాణంను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు, అధికారంలో ఉన్నప్పుడు కూడా బుద్దిమారడం లేదన్నారు. 21టీఎంసిల నీటితో కళకళలాడుతున్న మల్లన్న సాగర్ లో పూజలు నిర్వహిస్తామని వొస్తే అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. మీరు వ‌చ్చి పూజలు చేయండి చేసిన పాపాలు కొన్నయినా పోతాయని హితువు పలికారు.

మల్లన్న సాగర్ లో పండే ప్రతి గింజలో కెసిఆర్ పేరుంటుంది అని, రైతు గుండెల్లో కెసిఆర్ ఉంటాడని తెలిపారు. కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటున్న కాంగ్రెస్ నాయకులు బుద్ది తెచ్చుకోవాలన్నారు. కాళేశ్వరం కొట్టుకు పోతే అన్నపూర్ణలో 3, రంగనాయక సాగర్ లో 3, మల్లన్న సాగర్ లో 21, కొండపోచమ్మ సాగర్ లో 10 టిఎంసిల నీళ్లు ఎలా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు.

గతంలో ఆగస్టు నెలలో చేప పిల్లలు వేశామని, నేడు (సెప్టెంబర్ 20) దాటినా చేప పిల్లలు వేయలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి చేపలు, రొయ్యలు వేసి మత్స్య కారులను ఆదుకోవాలన్నారు. చెరువు, కుంటలను ప్రాజెక్టులతో అనుసంధానం చేసుకోవడంతో మత్స్య కారులకు మేలు జరిగిందన్నారు.

- Advertisement -

మెదక్, యాదాద్రి, సిద్దిపేట జిల్లలో పంటలు పండటం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ పూర్తి అయిందని, అసంపూర్తిగా ఉన్న కాలువలు పూర్తి చేయాలన్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు, మూసీ కి నీళ్లు తీసుకెళ్తా అన్నారు. దానికి కెసిఆర్ నిర్మించిన మల్లన్న సాగర్ తోనే సాధ్యం అవుతుంది కదా అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement