కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వమని, రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయన నల్గోండ జిల్లాలో పర్యటించారు. గూడూరు, వెంకటాద్రిపాలెం గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఆలయాలలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు.
- Advertisement -
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. ధాన్యానికి రైస్ మిల్లర్స్ మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇది ప్రభుత్వం రైస్ మిల్లర్లను అన్ని రకాలుగా ఆదుకున్నప్పుడు రైతులకు మేలు చేయడానికి ప్రయత్నం చేయాలన్నారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.