Thursday, November 21, 2024

విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీలపై కాంగ్రెస్ కన్నెర్ర..

విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీలపై కాంగ్రెస్ కన్నెర్ర చేసింది. కరీంనగర్ విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు విద్యుత్ చార్జీలను పెంచమని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ విద్యుత్ డెవలప్మెంట్ చార్జీల పేరుతో అధికంగా కరెంటు బిల్లులు వసూలు చేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తోందని నేతలు ఆరోపించారు. పేద ప్రజలు దీనితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. మూడు యూనిట్లు వాడే వారికి సైతం వేల రూపాయల విద్యుత్ డెవలప్మెంట్ చార్జీలు వేయడం సరికాదన్నారు. విద్యుత్ డెవలప్మెంట్ చార్జీల పేరిట వసూళ్లను నిలిపివేయాలని కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement